Pooja Hegde: కొత్త కథతో ఆరంభం!

ABN , Publish Date - May 11 , 2024 | 09:55 AM

అతి తక్కువ సమయంలో తెలుగునాట అగ్ర కథానాయికగా గుర్తింపు పొందింది పూజాహెగ్డే(Pooja hegde). టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అందరితో యాక్ట్‌ చేసింది. అయితే 'గుంటూరు కారం' (Guntur kaaram) చిత్రంలో అవకాశం మిస్‌ అయిన తర్వాత తెలుగులో మరో అవకాశం దక్కలేదు

Pooja Hegde: కొత్త కథతో ఆరంభం!

అతి తక్కువ సమయంలో తెలుగునాట అగ్ర కథానాయికగా గుర్తింపు పొందింది పూజాహెగ్డే(Pooja hegde). టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అందరితో యాక్ట్‌ చేసింది. అయితే 'గుంటూరు కారం' (Guntur kaaram) చిత్రంలో అవకాశం మిస్‌ అయిన తర్వాత తెలుగులో మరో అవకాశం దక్కలేదు. తమిళంలో బాగానే సినిమాలు చేసింది. బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. గతేడాది ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ చిత్రంతో అలరించిన ఈ బెంగళూరు బ్యూటీ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా కావడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. అహాన్ శెట్టి (Ahan shetty) తో కలిసి నటిస్తున్న చిత్రం ‘సంకీ’ (Sanki). అద్నాన్‌ షేక్‌, యాసిర్‌ రూ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు సమాచారం.

Pooja.jpg‘ఈ సినిమాతో పూజా హెగ్డే సరికొత్త ప్రయాణం ఆరంభం కానుంది. జాన్‌లో షూటింగ్‌ను మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాకు కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీని కోసం ముంబయిలో భారీ బడ్జెట్‌తో సెట్‌ను సిద్థం చేసింది చిత్రబృందం. ఇందులో అహాన్‌, పూజ మధ్య కెమిస్ర్టీ సినిమాకే స్పెషల్‌ ఎట్రాక్షన్ గా నిలవనుంది.’ పూజాహెగ్డే సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రేమకథ ఇతివృత్తంగా సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - May 11 , 2024 | 10:05 AM