Pathaan 2: ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ కన్నా ముందే!

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:32 PM

షారుక్‌ ఖాన్ కథానాయకుడిగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’. దీపిక పదుకొణె కథానాయిక. గతేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించింది.

 Pathaan 2: ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ కన్నా ముందే!
pathaan

షారుక్‌ ఖాన్(Shah rukh khan) కథానాయకుడిగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’ ( Pathaan 2). దీపిక పదుకొణె కథానాయిక. గతేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించింది. అంతే కాదు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పఠాన్‌2’ పట్టాలెక్కనుందని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రారంభించారని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది. యశ్‌ రాజ్‌ స్పై యూనివర్స్‌ విభాగంలో ఇదొక కీలక చిత్రంగా నిలవనుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో సరికొత్త టెక్నాలజీతో ఈ మూవీని తీయనున్నారని చెబుతున్నారు. సల్మాన్‌, షారుక్‌ కలిసి నటించే చిత్రం ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ కన్నా ముందే ఈ సినిమాను పూర్తి చేసే ప్రయత్రాల్లో ఉన్నారని తెలుస్తోంది.

Updated Date - Feb 20 , 2024 | 06:23 PM