Nana patekar: సినిమాల్లోకి రాకముందు ఏం చేశారో తెలుసా? 

ABN , Publish Date - Jan 06 , 2024 | 05:12 PM

బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన నటుల్లో నానా పటేకర్‌ (nana patekar)ఒకరు. విలక్షణ శైలి, సహజ నటనతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన ఆయన ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు.

Nana patekar: సినిమాల్లోకి రాకముందు ఏం చేశారో తెలుసా? 

బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన నటుల్లో నానా పటేకర్‌ (nana patekar)ఒకరు. విలక్షణ శైలి, సహజ నటనతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన ఆయన ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. నటనను వృత్తిగా భావించి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎక్కువ కనిపించిన ఆయన తన నటనతో మూడు జాతీయ, నాలుగు ఫిలింఫేర్‌ అవార్డులతోపాటు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 

తాజాగా ఓ వేదికపై తన చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు ''నా చిన్నతనం చాలా కష్టమైనది. చిన్నతనంలో తండ్రి చనిపోవడం వల్ల బాధ్యతలు నాపై పడ్డాయి. ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉండేది. జీబ్రా క్రాసింగ్‌లకు పెయింటింగ్‌ వేస్తూ డబ్బు సంపాదించేవాడిని. నాన్నకు ఉన్న ఫ్యాక్టరీని అక్రమంగా లేగేసుకోవడం వల్ల సర్వం కోల్పోయాం. 13 ఏళ్ల వయసులోనే పనికి వెళ్లడం మొదలు పెట్టాను. అప్పట్లో నెల రోజు పని చేస్తే రూ. 35 ఇచ్చేవారు’’ అని చెప్పారు. 

"సినిమాల్లోకి రావాలన్న ఆసక్తితో మొదట థియేటర్‌లో పనిచేయడం మొదలుపెట్టా. ఆ సమయంలో నీలకంఠను కలిశా. తను బ్యాంక్‌ ఉద్యోగి. అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా నటించేది. అప్పుడు నీలకంఠి నెల జీతం 2500 రూపాయలు. ఓ సందర్భంలో నీలకంఠిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.  1978లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత నీలకంఠి సినిమాలు చేయడం మానేసింది. 27 ఏళ్ల వయసుల్లో పెళ్లైంది. 28 సంవత్సరంలో నాన్న మరణించారు. ఆ వెంటనే పుట్టిన మగ బిడ్డను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత మెల్లగా సినిమా అవకాశాలు దక్కించుకుని నిలదొక్కుకున్నాను’’ అని చెప్పారు. మీటూ ఉద్యమం సమయంలో హీరోయిన తనూశ్రీ దత్తా నానా పాటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. అయితే ఆ ఆరోపణలు రుజువు కాలేదు. 


Updated Date - Jan 06 , 2024 | 05:12 PM