మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Naga Chaitanya: దూత సీజన్ -2కు సిద్ధం!

ABN, Publish Date - Mar 18 , 2024 | 03:09 PM

సినిమాలతోపాటు ఓటీటీ వైపు కూడా ఓ లుక్కేశారు నాగచైతన్య(Naga chaitanya). విక్రమ్‌ కె.కుమార్‌(Vikram k kumar) తో కలిసి 'దూత’ (Dhootha)అనే వెబ్‌ సిరీస్‌ చేశాడు చైతూ. ఆ సిరీస్‌ చక్కని విజయం సాధించింది.

సినిమాలతోపాటు ఓటీటీ వైపు కూడా ఓ లుక్కేశారు నాగచైతన్య(Naga chaitanya). విక్రమ్‌ కె.కుమార్‌(Vikram k kumar) తో కలిసి 'దూత’ (Dhootha)అనే వెబ్‌ సిరీస్‌ చేశాడు చైతూ. ఆ సిరీస్‌ చక్కని విజయం సాధించింది. దర్శకుడు విక్రమ్‌కి, హీరో చైతూకి మంచి గుర్తింపు వచ్చింది. అమెజాన్  ఫ్రైమ్‌ నిర్మించిన చిత్రమిది. ఇప్పుడు మరో సీజన్‌కు సిద్థమవుతోంది. దాదాపుగా ప్రతీ హిట్‌ సిరీస్‌కూ.. పార్ట్‌ 2 ఉంటుంది.  'దూత’ క్లైమాక్స్‌లో కూడా పార్ట్‌ 2 ఉందని లీడ్‌ ఇచ్చారు. దాంతో ‘దూత 2’ కూడా ఉందని ఓటీటీ వీక్షకులు ఫిక్స్‌ అయ్యారు. ఇప్పుడు మేకర్స్‌ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. సోమవారం అమేజాన్‌ ప్రైమ్‌ నుంచి ఓ కొత్త అప్‌డేట్‌ రాబోతోంది. ఈ విషయం ఓ టీజింగ్‌ వీడియోతో చెప్పేశాడు చైతూ. జర్నలిజం నేపథ్యంలో సాగే సిరీస్‌ ఇది. సీజన్‌ 1లో చైతూ క్యారెక్టర్‌ని గ్రే షేడ్స్‌లో చూపించారు. ఆ పాత్ర సీజన్‌ 2లో పూర్తి పాజిటీవ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘దూత 2’కి సంబంధించిన షూటింగ్‌ దాదాపుగా పూర్తయినట్టు టాక్‌.

Updated Date - Mar 18 , 2024 | 03:10 PM