OTT - Mirzapur 3: గత రెండు సీజన్లతో పోలిస్తే మరింత ఉత్కంఠభరితంగా

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:02 PM

'మీర్జాపూర్‌' (Mirzapur3) వెబ్‌ సిరీస్‌ ఓటీటీ వేదకగా ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే! ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించడంతో మూడో సీజన్ (Mirzapur Season 3) కోసం సినీ ప్రియులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

OTT - Mirzapur 3:  గత రెండు సీజన్లతో పోలిస్తే మరింత ఉత్కంఠభరితంగా

'మీర్జాపూర్‌' (Mirzapur3-OTT) వెబ్‌ సిరీస్‌ ఓటీటీ వేదకగా ఎంతగా ఆదరణ పొందిందో తెలిసిందే! ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించడంతో మూడో సీజన్ (Mirzapur Season 3) కోసం సినీ ప్రియులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. దీని  స్ట్రీమింగ్  తేదీని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. జులై 5 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్ (Amazon Prime) కానున్నట్లు వెల్లడించింది. సిరీస్‌ షూటింగ్‌ పూర్తయినట్లు ఏడాది క్రితమే నటీనటులు తెలిపారు. అప్పటి నుంచి స్ట్రీమింగ్  తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దాన్ని ప్రకటించడంతో ఓటీటీ ప్రేక్షకులు సంబర పడుతున్నారు. రెండో సీజన్‌ విడుదలై మూడేళ్లు గడిచినా అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్‌ మీడియా మీమ్స్‌గా దర్శనమిస్తుంటాయి.


క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లకు గుర్మిత్‌ సింగ్‌ (Gurmith singh) దర్శకత్వం వహించారు. తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  దానికి మంచి స్పందన రావడంతో సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ను విడుదల చేశారు. అది కూడా అద్భుత విజయం సాధించింది. మొదటి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. రెండో సీజన్‌లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. ఇందులో విజయ్‌ వర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు. గత రెండు సీజన్లతో పోలిస్తే  మూడో సీజన్‌ ఉత్కంఠభరితంగా ఉంటుందని మేకర్స్‌ చెప్పారు. 

Updated Date - Jun 11 , 2024 | 04:34 PM