Kriti Sanon: మహేష్ బాబు హీరోయిన్ ఏంటి అలా రెచ్చిపోయింది

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:48 PM

ఈమధ్య కాలంలో మంచి విజయాల కోసం ఎదురు చూస్తున్న కృతి సనన్ కి 'క్రూ' సినిమాతో ఆ కోరిక తీరవచ్చు అని అంటున్నారు. ఈ సినిమా ఈనెల 29న విడుదలవుతోంది. ఇందులో కృతి సనన్ తో పాటు కరీనా కపూర్, టబ్బు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Kriti Sanon: మహేష్ బాబు హీరోయిన్ ఏంటి అలా రెచ్చిపోయింది
Kriti Sanon

బాలీవుడ్ అగ్ర నటీమణుల్లో ఒకరైన కృతి సనన్ తన తదుపరి సినిమా 'క్రూ' ప్రచారాలు చేస్తోంది. ఈ సినిమాలో కృతి సనన్ తో పాటు, టబ్బు, కరీనా కపూర్ లు కూడా ప్రధాన పాత్రల్లో కనపడుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది, ఇది విమానంలో పని చేస్తే ముగ్గురు ఎయిర్ హోస్టెస్ ల నేపథ్యంలో తీసిన సినిమా అని అర్థం అవుతోంది.

kritisanonone.jpg

ఈ ముగ్గురూ విమానంలో ఎయిర్ హోస్టెస్ వుద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురైన కొన్ని సంఘటనలు, దానికి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే నేపథ్యంలో ఉంటూ దీనికి చిన్న క్రైమ్ కూడా జతచేసినట్టుగా కనపడుతోంది. ట్రైలర్ లో కరీనా, టబ్బు, కృతి సనన్ లు ప్రధాన పాత్రలుగా చేసినట్టుగా తెలుస్తోంది. వీరు ముగ్గురూ మంచి స్నేహితులు, అలాగే వీరు ఒక ఎయిర్ లైన్స్ లో విమానంలో కేబిన్ క్రూ గా పని చేస్తూ వుంటారు. వీరిమధ్య వచ్చే సంభాషణ, సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా వున్నట్టుగా ట్రైల్ చూస్తే అర్థం అవుతోంది.

kritisanonnewone.jpg

ఈ హిందీ సినిమా ఈనెల 29న విడుదలవుతోంది. కృతి సనన్ ఇంతకు ముందు సినిమాలో రోబో గా నటించింది, ఇప్పుడు ఈ 'క్రూ' సినిమాలో ఎయిర్ హోస్టెస్ గా నటిస్తోంది. ఈ సినిమాకి రాజేష్ కృష్ణన్ దర్శకుడు కాగా, ప్రముఖ టీవీ, సినిమా నిర్మాత ఏక్తా కపూర్, ప్రముఖ నటుడు అనిల్ కపూర్ లు నిర్మాతలుగా ఉండటం ఆసక్తికరం. కృతి సనన్ కి ఈమధ్య మంచి విజయం అంటూ ఏదీ ఆమె ఖాతాలో నమోదు కాలేదు. ఇప్పుడు ఈ 'క్రూ' సినిమాతో మంచి విజయం సాధించవచ్చు అని ఒక టాక్ నడుస్తోంది.

kritisanon.jpg

ఎందుకంటే ఈ సినిమాలో కరీనా కపూర్, టబ్బు ల పాత్రలు కూడా బాగున్నాయి అనిపిస్తోంది. అలాగే ముగ్గురూ చాలా అందంగా, గ్లామరస్ గా కనపడుతున్నారు. టబ్బు, కరీనా కపూర్ లు అనుభవం వున్న నటీమణులు, ఇప్పుడు వీళ్ళకి యువ నటీమణి కృతి సనన్ తోడైంది. ఏక్తా కపూర్ ఏ సినిమా అయినా కథ సరైంది లేకపోతే నిర్మాతగా ఆ సినిమా చెయ్యరు అని, ఈ కథ నచ్చి ఆమె ఈ సినిమా నిర్మించారని, అందుకని ఈ సినిమా విజయం సాధించి ఈ ముగ్గురి కథానాయకులకు మంచి పేరు తెస్తుందని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

Updated Date - Mar 19 , 2024 | 04:52 PM