Kriti kharbanda: ప్రేమికుల రోజున బాయ్‌ ఫ్రెండ్‌తో ఏం చేసిందంటే!

ABN , Publish Date - Feb 15 , 2024 | 05:35 PM

బోణి చిత్రంతో టాలీవుడ్‌కు బోణీ కొట్టింది ఢిల్లీ బ్యూటీ కృతీ కర్భంద. తదుపరి అలా మొదలైంది, కెమెరామెన్‌ గంగతో రాంబాబు, తీన్‌మార్‌, ఒంగోలు గిత్త. బ్రూస్‌లీ, మిస్టర్‌ నూకయ్య, ఓం త్రీడీ వంటి చిత్రాల్లో నటించింది.

Kriti kharbanda: ప్రేమికుల రోజున బాయ్‌ ఫ్రెండ్‌తో ఏం చేసిందంటే!

బోణి చిత్రంతో టాలీవుడ్‌కు బోణీ కొట్టింది ఢిల్లీ బ్యూటీ  కృతీ కర్భంద. తదుపరి అలా మొదలైంది, కెమెరామెన్‌ గంగతో రాంబాబు, తీన్‌మార్‌, ఒంగోలు గిత్త. బ్రూస్‌లీ, మిస్టర్‌ నూకయ్య, ఓం త్రీడీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే అవకాశాలు బాగానే అందుకుంది కానీ సక్సెస్‌ రేట్‌ తక్కువ. 2015లో వచ్చిన ‘బ్రూస్‌లీ’లో రామ్‌చరణ్‌కు అక్కగా కనిపించింది. తెలుగుతోపాటు కన్నడలోనూ చాలా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా అయింది. అయితే 2019 నుంచి ఆమె ఓ బాలీవుడ్‌ నటుడితో ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగిందని వార్తలొచ్చాయి. ఆ ఫొటోలు బయటకు రావడంతో  నిశ్చితార్థం నిజమేనని తేలింది. అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య కృతి పులకిత్  సామ్రాట్‌తో నిశ్చితార్థం జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కబోతోందని తెలిసింది.

WhatsApp Image 2024-02-15 at 4.48.24 PM.jpeg

వాలంటైన్స్‌డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్‌తో పెళ్లిపై హింట్‌ కూడా వచ్చేసింది. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అంతే కాకుండా మార్చి నెలలోనే ఒక్కటి కాబోతున్నామంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. దీంతో జంట వచ్చే నెలలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేమికుల రోజే క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. ఇంకా పెళ్లి తేదీ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీరిద్దరూ 2019 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. పాగల్‌పంతి సెట్‌లో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఈ జంట పాగల్‌పంటి సినిమాతో పాటు 'వీరే కి వెడ్డింగ్‌’, తైష్‌ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. పుల్కిత్‌ సామ్రాట్‌ చివరిసారిగా ఫక్రీ- 3లో కనిపించారు. కృతి కర్బంద నటించిన తాజా చిత్రం రిస్కీ రోమియో విడుదలకు సిద్థమవుతోంది.

Updated Date - Feb 15 , 2024 | 05:35 PM