Ira Khan: ఆమిర్ ఖాన్ కూతురు ఎంత అందంగా వుందో చూసారా, ఆమె గురించి తెలుసుకోండి

ABN , Publish Date - Jan 04 , 2024 | 01:35 PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్ వివాహం ఇప్పుడు వార్తల్లో వుంది. అందరూ ఐరాఖాన్ ఏమి చేస్తున్నారు, ఆమె గురించిన వివరాలు తెలుసుకోవాలని ఎక్కువ వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఏమి చేస్తోంది, ఆమె అభిరుచులు, ఆమె స్నేహితులు, ఆమె ఎక్కడ చదువుకుంది ఇవన్నీ వివరాలు కొన్ని

Ira Khan: ఆమిర్ ఖాన్ కూతురు ఎంత అందంగా వుందో చూసారా, ఆమె గురించి తెలుసుకోండి
Ira Khan

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇంట్లో పెళ్లిసందడి మొదలైంది. అతని కుమార్తె ఐరా ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆమె తన స్నేహితుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అయినా నుపుర్‌ శిఖరేను వివాహం చేసుకుంది. ముంబైలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో వీరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు. అలాగే జనవరి 8వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మరోసారి బ్యాండ్ బాజాలతో పెళ్లి చేసుకోనున్నారు అని కూడా తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖుల కోసం జనవరి 13న ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు అని కూడా సమాచారం అందుతోంది.

irakhanglamour.jpg

ఐరాఖాన్ వివాహం ఇప్పుడు వార్తల్లో వుంది. అందరూ ఐరా ఖాన్ ఏమి చేస్తున్నారు, ఆమె గురించిన వివరాలు తెలుసుకోవాలని ఆమె గురించి ఎక్కువ వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఏమి చేస్తోంది, ఆమె అభిరుచులు, ఆమె స్నేహితులు, ఆమె ఎక్కడ చదువుకుంది అనే వివరాల్లోకి వెళితే..

ఐరా ఖాన్‌, ప్రముఖ నటుడు అమీర్‌ ఖాన్‌, రీనా దత్తాల (మొదటి భార్య) కుమార్తె. ఐరాఖాన్‌ ఆగస్టు 17, 1997 న పుట్టింది, ఆమె వయసు ఇప్పుడు 27 సంవత్సరాలు. ఐరాఖాన్‌ బాలీవుడ్ లో ఎటువంటి ఎంట్రీ ఇవ్వలేదు కానీ ఒక థియేటర్ ప్లే కి దర్శకత్వం వహించింది అని తెలుస్తోంది. ఈమెకి ఒక అన్న జునైద్ ఖాన్ వున్నాడు.

irakhanhotpic.jpg

ఇంతకు ముందు ఐరా ఖాన్‌, మిశాల్ కిర్పాలని అనే అతనితో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది అని వార్తలు వున్నాయి. అయితే వాళ్ళిద్దరి బంధం ఎన్నాళ్ళో వుండలేదు, 2019 సంవత్సరం చివరిలో వాళ్లిద్దరూ విడిపోతున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత ఐరా ఖాన్‌.. ఆమిర్ ఖాన్‌కి ఫిట్ నెస్ ట్రైనర్ గా వున్న నుపుర్ శిఖరే తో ప్రేమలో పడటం, వివాహం చేసుకోవటం జరిగింది.

irakhanmarriage.jpg

ఐరా ఖాన్‌ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. స్కూల్ చదువు అంతా ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, ముంబై లో చదివింది. తర్వాత యూనివర్సిటీ కాలేజీ వుట్రెచ్‌లో చదివింది.

irakhanveryhot.jpg

ఐరా ఖాన్‌‌కి ఇష్టమైన నటుడు రణవీర్ సింగ్, ఇష్టమైన నటీమణులు మాధురి దీక్షిత్, దీపికా పదుకోన్. ఆమెకి ఇష్టమైన సినిమా షారుఖ్ ఖాన్ నటించిన 'డీజేఎల్ జె'. ఆమెకి ఇష్టమైన విహార ప్రదేశం మాస్కో. 'దంగల్' సినిమాలో చేసిన ఫాతిమా సనా షేక్, జాన్వీ కపూర్ ఈ ఇద్దరూ ఐరా ఖాన్‌ కి బెస్ట్ స్నేహితురాళ్లు. అలాగే ముంబై ఐపీఎల్ క్రికెట్ టీం అంటే ఆమెకి అభిమానం. వీధి కుక్కలు గురించి ఒకసారి ఒక ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహించి వచ్చిన డబ్బుని ఒక ఆర్గనైజేషన్ కి డొనేట్ చేశారు.

Updated Date - Jan 04 , 2024 | 01:50 PM