Kiara Advani: ఫ్రాంచైజ్‌ చిత్రం కోసం పాట్లు...

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:33 AM

గత ఏడాది 'సత్యపేమ్‌ కీ కహానీ’ చిత్రంతో అలరించిన ముంబై బ్యూటీ కియారా అద్వానీ (kiara adwani) ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో 'గేమ్‌ ఛేంజర్‌', హిందీలో  'వార్‌ 2' (War -2), 'డాన్-3' (Don-3) చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె ఇంటర్‌నేషనల్‌ ట్రైనింగ్‌కు రెడీ అవుతున్నారు.

 Kiara Advani: ఫ్రాంచైజ్‌ చిత్రం కోసం పాట్లు...

గత ఏడాది 'సత్యపేమ్‌ కీ కహానీ’ చిత్రంతో అలరించిన ముంబై బ్యూటీ కియారా అద్వానీ (kiara adwani) ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో 'గేమ్‌ ఛేంజర్‌', హిందీలో  'వార్‌ 2' (War -2), 'డాన్-3' (Don-3) చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె ఇంటర్‌నేషనల్‌ ట్రైనింగ్‌కు రెడీ అవుతున్నారు.  హిందీ ‘డాన్‌’ ఫ్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం ‘డాన్‌ 3’. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించనున్నారు. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ఇందులో హీరోహీరోయిన్ల ఇద్దరికీ యాక్షన్ సీక్వెన్స్ విపరీతంగా ఉంటాయట. దీని కోసం అంతర్జాతీయ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ పర్యవేక్షణలో ఇద్దరూ స్టంట్స్‌ నేర్చుకోనున్నారని బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఇప్పటికే ఇద్దరూ శిక్షణలో ఉన్నారని, దాని కోసం విదేశాలకు వెళ్లారని తెలిసింది. అయితే ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్‌ కోసం కియారా ఎంతో కష్టపడుతోందని సన్నిహితుల నుంచి సమాచారం. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుందని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.

'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కియార ప్రస్తుతం రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్ లో వస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌'లో కథానాయికగా నటిస్తోంది. తెలుగులో ఆమెకిది మూడో సినిమా.

Updated Date - Feb 29 , 2024 | 12:09 PM