Kangana ranaut: అప్పటి వివాదం మళ్లీ తెరపైకి! 

ABN , Publish Date - Jan 07 , 2024 | 10:48 AM

ప్రముఖ బాలీవుడ్‌ సినీ రచయిత జావేద్‌ అక్తర్‌ (javed Aktar) తనపై వేసిన పరువునష్టం దావాపై విచారణను నిలిపివేయాలని కోరుతూ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana ranaut) ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో తాను వేసిన క్రాస్‌ పిటిషన్‌తో కలిపి దాన్ని విచారించాలని విజ్ఞప్తి చేశారు.

Kangana ranaut: అప్పటి వివాదం మళ్లీ తెరపైకి! 

ప్రముఖ బాలీవుడ్‌ సినీ రచయిత జావేద్‌ అక్తర్‌ (javed Aktar) తనపై వేసిన పరువునష్టం దావాపై విచారణను నిలిపివేయాలని కోరుతూ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana ranaut) ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో తాను వేసిన క్రాస్‌ పిటిషన్‌తో కలిపి దాన్ని విచారించాలని విజ్ఞప్తి చేశారు. తన పరువుకు భంగం కలిగేలా నేషనల్‌ ఛానల్స్‌లో కంగన మాట్లాడారని ఆరోపిస్తూ జావేద్‌ అక్తర్‌ 2020లో ఆమెపై పరువునష్టం దావా (వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నేరపూరిత కుట్ర, గోప్యతకు భంగం కలిగించడం వంటి ఆరోపణలతో అక్తర్‌పై కంగన క్రాస్‌ పిటిషన్‌ (defamation Case) వేశారు. దీంతో 2023, జులై 24న అంధేరి మేజిరేస్టట్‌ కోర్టు అక్తర్‌కు సమన్లు జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా దిండోషిలోని సెషన్స్‌ కోర్టులో ఆయన రివిజన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. కంగన ఫిర్యాదుకు సంబంధించి క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌, సమన్ల జారీపై ఆ కోర్టు ేస్ట విధించింది. హీరో హృతిక్‌ రోషన్‌ తనను మోసం చేశాడంటూ కంగన గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం కోరు దాకా వెళ్లింది.

2020లో ఓ ఇంటర్వ్యూలో కంగనా హృతిక్‌తో గొడవ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇదే విషయంలో జావేద్‌ తనను ఇంటికి పిలిచి మరీ బెదిరించారని చెప్పింది. కంగన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జావేద్‌ ఆమెపై పరువునష్టం దావా వేశారు.అక్తర్‌  తన ఫిర్యాదులు ఒకే సంఘటనకు సంబంధించినవనీ.. రెండు విరుద్థ తీర్పులను నివారించడానికి వాటిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని కంగన  హైకోర్టును కోరారు. తన పిటిషన్‌పై విచారణ ఆగిపోయిందని, అక్తర్‌ది మాత్రం కొనసాగుతోందని.. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. కంగన వేసిన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ జనవరి 9న విచారించే అవకాశం ఉంది. 


Updated Date - Jan 07 , 2024 | 10:50 AM