Kangana - Madhavan: సూపర్‌హిట్‌ జోడి.. మరో సర్‌ప్రైజ్‌!

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:02 PM

మాధవన్ , కంగనా రనౌత్ బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ జోడీగా గుర్తింపు పొందారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘తను వెడ్స్‌ మను’, ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ జంట మళ్లీ కట్టబోతున్నారు.

Kangana - Madhavan: సూపర్‌హిట్‌ జోడి.. మరో సర్‌ప్రైజ్‌!

మాధవన్ , కంగనా రనౌత్  బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ జోడీగా గుర్తింపు పొందారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘తను వెడ్స్‌ మను’, ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ జంట మళ్లీ కట్టబోతున్నారు. తాజాగా వీరిద్దరూ ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని కంగనా స్వయంగా ఇనస్టాగ్రామ్‌లో స్టేటస్‌లో షేర్ చేశారు. మాధవన్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘‘నేను నా అభిమాన నటుడితో మరో సర్‌ప్రైజ్‌ మూవీ కోసం జతకడుతున్నాను’ అని క్యాప్షన్‌ ఇస్తే ‘కంగనా రనౌత్‌తో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను’ అని మాధవన పోస్ట్‌ చేశారు.
Kangana.jpg

ప్రస్తుతం వీరిద్దరూ స్క్రిప్ట్  పనులో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ వీలైనంత త్వరగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. 2011లో ‘తను వెడ్స్‌ మను’ సినిమా విడుదలై సూపర్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత 2015లో ఇదే సినిమాకు సీక్వెల్‌ ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ విడుదలైంది. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత కొత్త సినిమా కోసం మాధవన కంగనా రనౌత్‌ జంటగా నటిస్తున్నారు. అయితే ఈ సారి చేసేది ఏ జానర్‌ అనేది వెల్లడించలేదు.
Untitled-2.jpg

తాజాగా కంగనా రనౌత్  దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ఆమె ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.  ‘ఎమర్జెన్సీ’ జూన్‌ 14న విడుదల కానుంది. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్‌ తల్పడే కనిపించనున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 06:04 PM