Jyothika: బాలీవుడ్‌లో అవకాశాలు ఎందుకు రాలేదంటే!

ABN , Publish Date - May 10 , 2024 | 05:37 PM

తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో అలరించిన జ్యోతిక (Jyothika) బాలీవుడ్‌ తెరపై 27 ఏళ్ల తర్వాత కనిపించారు. 1997లో జ్యోతిక నటించిన హిందీ చిత్రం విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘షైతాన్‌’ (Shaitan)అనే సినిమాతో ఈ ఏడాది బీటౌన్‌ తెరపై సందడి చేశారు.

Jyothika:  బాలీవుడ్‌లో అవకాశాలు ఎందుకు రాలేదంటే!


తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో అలరించిన జ్యోతిక (Jyothika) బాలీవుడ్‌ తెరపై 27 ఏళ్ల తర్వాత కనిపించారు. 1997లో జ్యోతిక నటించిన హిందీ చిత్రం విడుదలైంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘షైతాన్‌’ (Shaitan)అనే సినిమాతో ఈ ఏడాది బీటౌన్‌ తెరపై సందడి చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్‌లో లాంగ్‌ గ్యాప్‌ రావడానికి గల  కారణాన్ని వివరించారు. ‘‘తొలి చిత్రం ఫలితంపైనే మన కెరీర్‌ ఆధారపడి ఉంటుందని బలంగా నమ్ముతాను. నేను నటించిన మొదటి హిందీ సినిమా అనుకున్నంత స్థ్థాయిలో అలరించలేకపోయింది. దీంతో నాకు అక్కడ అవకాశాలు రాలేదు. దక్షిణాదిలో నేను నటించిన ఎన్నో సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందాను. అయినా.. బాలీవుడ్‌ నుంచి ఒక్క ఆఫర్‌ కూడా రాలేదు. ప్రేక్షకులు నన్ను దక్షిణాది నటిగానే గుర్తుంచుకున్నారు. అందుకే నాకూ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించాలని ఆసక్తి లేదు’ అని అన్నారు. .

ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌  ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘శ్రీకాంత్‌’. ఇందులో జ్యోతిక టీచర్‌ పాత్రలో కనిపించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య (Suriya) హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో జ్యోతిక నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వస్తున్నాయి. ‘బెంగుళూరు డేస్‌’ ఫేమ్‌ అంజలి మేనన్‌ ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల జ్యోతిక స్పందించారు. సరైన స్ర్కిప్ట్‌ కోసం చర్చలు జరుపుతున్నామన్నారు. మంచి కథ ఉంటే సూర్యతో కచ్చితంగా కలిసి నటిస్తానని క్లారిటీ ఇచ్చారు. 

Updated Date - May 10 , 2024 | 06:43 PM