Janhvi kapoor: పెళ్లి రూమర్లపై జాన్వీ ఏమందంటే!

ABN , Publish Date - May 29 , 2024 | 04:07 PM

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi kapoor) పెళ్లి వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఈ విషయం మరోసారి తెరపైకి రావడంతో  ఆమె స్పందించారు.

Janhvi kapoor: పెళ్లి రూమర్లపై జాన్వీ ఏమందంటే!
Janhvi kapoor

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi kapoor) పెళ్లి వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఈ విషయం మరోసారి తెరపైకి రావడంతో  ఆమె స్పందించారు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr and mS mahi) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.  పెళ్లిపై వచ్చిన రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.  ఇటీవల జాన్వీ పెళ్లిపై ఓ నెటిజన్‌ పోస్ట్‌ పెట్టగా.. దానికి ఆమె రియాక్ట్‌ అయ్యారు. ‘ఏదైనా రాస్తారా..’ అని రిప్లై పెట్టారు. 


Janhvi Kapoor Latest Photos

‘ఈ మధ్య  నా పెళ్లికి సంబంధించిన వార్తలు కొన్ని చదివాను, టీవీల్లో చూశాను.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారు. నేను మాట్లాడిన రెండు మూడు ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటల్ని కథనాలు మిక్స్‌ చేసి అలా రాసేశారు.  నాకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా’ అని అన్నారు. దీంతో ఈ వార్తలకు చెక్‌ పడినట్లు అయింది. అలాగే సరదాగా నెటిజన్లతో సంభాషించారు జాన్వీ. ఇందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై వైరల్‌గా మారింది. ‘మనం డేట్‌కు వెళ్దామా? అది మంచి స్టోరీ అవుతుంది’ అని ఓ యూజర్‌ అడగ్గా దానికి జాన్వీ సరదాగా స్పందించారు. ‘నువ్వు గొడ్డలితో నరికి చంపేసే హంతకుడివి అయితే ఎలా?’ అన్నారు. రెడిట్‌ను తనకంటే తన చెల్లి ఖుషీనే ఎక్కువగా వాడుతుందని చెప్పారు. ఇందులో విశేషాలను చెల్లిని అడిగి తెలుసుకుంటానని జాన్వీ చెప్పారు. జాన్వీ ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే31న ప్రేక్షకుల  ముందుకు రానుంది. దీనితో పాటు తెలుగులో దేవర, రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేస్తోంది. 

Updated Date - May 29 , 2024 | 05:39 PM