Janhvi Kapoor: ఇప్పటికి గొంతు తడబడుతుంది. కళ్లు చమర్చుతాయి

ABN , Publish Date - May 23 , 2024 | 04:20 PM

తన తల్లి శ్రీదేవి మరణించిన సమయంలో కొందరు ప్రతికూల కామెంట్స్‌ చేశారని జాన్వీ కపూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు  తాజాగా ఆమె నటించిన చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్  లో  బిజీగా ఉన్నారు

Janhvi Kapoor: ఇప్పటికి గొంతు తడబడుతుంది. కళ్లు చమర్చుతాయి

తన తల్లి శ్రీదేవి (Sridevi death)మరణించిన సమయంలో కొందరు ప్రతికూల కామెంట్స్‌ చేశారని జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఆవేదన వ్యక్తం చేశారు  తాజాగా ఆమె నటించిన చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr and Ms Mahi). ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్  లో  బిజీగా ఉన్నారు జాన్వీకపూర్‌. అందులో తన తల్లి మరణించినప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి మరణించిన కొన్ని నెలలకు జాన్వీ నటించిన మొదటి సినిమా ధడక్‌’ సినిమా విడుదలైంది. తల్లిని కోల్పోయిన బాధలో ఉండి కూడా కూడా ఆమె ప్రమోషన్ లో భాగమైన సంగతి తెలిసిందే. తల్లి పోయిందనే బాధ లేకుండా సినిమా ప్రచారాల్లో తిరుగుతోంది అని పలువురు కామెంట్స్‌ చేశారు. దాని గురించి జాన్వీ తాజాగా మరోసారి స్పందించారు.

కేకలు వేసి ఏడుస్తూ బయటకొచ్చేశా!

‘అమ్మ మరణించిన కొన్ని రోజులకే నేను ‘ధడక్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను. ఈ క్రమంలో ఓ డ్యాన్స్‌ రియాలిటీ కార్యక్రమానికి వెళ్లాను. వాళ్లు అమ్మకు సంబంధించిన పాటలు, వీడియోలతో అమ్మకు నివాళులు అర్పిస్తూ  డాన్సులు చేశారు. అది చాలా బాగున్నప్పటికీ నేను చూడలేకపోయాను. కేకలు వేసి ఏడుస్తూ బయటకు వచ్చేసి నా కార్‌లో కూర్చున్నాను. దీంతో వారంతా ఆ కార్యక్రమాన్ని నిలిపేశారు.. అమ్మ మరణం నన్ను ప్రభావితం చేయలేదని చాలా మంది అనుకున్నారు. అది నిజం కాదు. ఆమె చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటకు రావాలనే నేను పనిపై దృష్టిపెట్టాను. దాన్ని అర్థం చేసుకోకుండా కొందరు చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయి. మా అమ్మ గురించి నేను ఏ ఇంటర్వ్యూలో ప్రస్తావించినా కొందరు నెగెటివ్‌ కామెంట్స్‌ చేసేవారు. ఇప్పటికీ అమ్మ గురించి మాట్లాడాలంటే నా గొంతు తడబడుతుంది. కళ్లు చమర్చుతాయి’’ అని జాన్వీకపూర్‌ అన్నారు. Janhvey.avif

మీదకు ఫోన్లు విసిరారు..
ఇదిలా ఉండగా ప్రమోషన్సలో భాగంగానే అహ్మదబాద్‌లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్ కు  జాన్వీ తన స్నేహితుడు ఉరీతో కలిసి వెళ్లింది, రాయల్‌ ఛాలెంజర్స్‌, రాజస్థాన్   రాయల్స్‌కు మధ్య జరిగిన పోటీనను వీక్షించింది. తన అభిమాన టీమ్‌ అయిన రాయల్‌ ఛాలెంజర్‌ గెలవాలని కోరుకుంది. అయితే దురదృష్టశాత్తు రాయల్‌ ఛాలెంజర్స్‌ టీమ్‌ ఓడిపోయింది. అయితే పైన గ్యాలరీ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న జాన్వీపైకి అభిమానులు ఫోన్లు విసిరారు.  అవి గాల్లో ఎగురుతుండగా జాన్వీ వాటిని గమనించింది. ఇంతకీ ఆ ఫోన్లు గాల్లోకి విసరాడానికి కారణం సెల్ఫీల కోసమట. ప్రస్తుతం ఈ వీడియోలు ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం జాన్వీ హీరోయిన్ గా శరణ్‌ శర్మ దర్శకత్వంలో ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ మే 31న విడుదల కానుంది. దీనితోపాటు జాన్వీ టాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో తంగం పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేశారు జాన్వీ అలాగు రామ్‌చరణ్‌  ముచ్చిబాబు సాన దర్శకత్వంలోనూ ఆమె నటించనుంది. ఆగస్ట్‌ నుంచి ఈ చిత్రం సెట్స్‌మీదకెళ్లనుంది. 

Read More: Tollywood, Bollywood, Cinema News

Updated Date - May 23 , 2024 | 05:56 PM