పారితోషికం రూ.250 కోట్లా?

ABN , Publish Date - May 22 , 2024 | 12:55 AM

బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి, పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్‌ అయిన ప్రియాంక నటనకు గుడ్‌బై చెప్పకుండా హాలీవుడ్‌ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగానే ఉన్నారు...

పారితోషికం రూ.250 కోట్లా?

బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి, పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్‌ అయిన ప్రియాంక నటనకు గుడ్‌బై చెప్పకుండా హాలీవుడ్‌ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగానే ఉన్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఆమె గత ఏడాది ‘సెటడెల్‌’ సిరీస్‌లో నటించారు. దీనికి ఇండియన్‌ వెర్షన్‌లో ప్రియాంక పాత్రను సమంత చేశారు. ‘సిటాడెల్‌’లో నటించినందుకు ప్రియాంక తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? దాదాపు రూ. 250 కోట్లు. బాపురే.. అనుకోకండి. ఇది నిజమే. ఇటీవల వచ్చిన సంజయ్‌ లీలా భన్సాలి ‘హీరామండీ’ కోసం నెట్‌ఫ్లిక్స్‌ చెల్లించిన మొత్తం కంటే ప్రియాంక తీసుకున్న పారితోషికమే ఎక్కువట. అంటే ఇప్పుడు ఓటీటీలో హయ్యెస్ట్‌ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ ప్రియాంక నే అన్నమాట. ఆమె పనే బాగుంది కదూ!

Updated Date - May 22 , 2024 | 01:32 AM