Ileana D'Cruz: బాత్రూమ్‌ సెల్ఫీ.. అప్పటి జ్ఞాపకాలు

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:25 PM

గోవా బ్యూటీ ఇలియానాకు బీచ్ అన్నా, బాత్ టబ్‌ అన్నా ప్రాణం. కుదిరితే బీచ్ దగ్గర విహరిస్తుంటుంది. లేదా ఇంట్లో ఉన్న బాత్ టబ్‌నే బీచ్ గా భావిస్తూ నీటితో ఆడుతుంటుంది. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి జీరో సైజ్‌ బాడీని మెయినటెన్ చేస్తున్న కథానాయిక ఈమె.

Ileana D'Cruz:  బాత్రూమ్‌ సెల్ఫీ.. అప్పటి జ్ఞాపకాలు

గోవా బ్యూటీ ఇలియానాకు(Ileana D'Cruz) బీచ్  అన్నా, బాత్ టబ్‌ అన్నా ప్రాణం. కుదిరితే బీచ్ దగ్గర విహరిస్తుంటుంది. లేదా ఇంట్లో ఉన్న బాత్  టబ్‌నే  బీచ్ గా  భావిస్తూ నీటితో ఆడుతుంటుంది.  కెరీర్‌ బిగినింగ్‌ నుంచి జీరో సైజ్‌ బాడీని మెయినటెన్  చేస్తున్న కథానాయిక ఈమె. గతేడాది ఆగస్ట్‌ ఒకటో తేదీని ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అమ్మతనాన్ని(Ileana motherhood) ఆస్వాదిస్తోంది. తాజాగా ఇలియానా పోస్ట్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో బికినీ ధరించి బాత్రూమ్‌లో దిగిన ఫొటో ఒకటి  ఇన్స్టాలో షేర్‌ చేసింది. ఈ మిర్రర్‌ సెల్ఫీ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉండటం విశేషం. బ్లాక్‌ బికినీలో (Ileana Babybumb)ఓ చేత్తో తన బేబీ బంప్‌ను చూపిస్తూ సెల్ఫీ దిగింది. ‘‘ఏడాది కిందట. నాలుగు నెలల ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో ఇలా’’ అనే క్యాప్షన్‌తో ఇలియానా ఈ ఫొటో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Iliana.jpg

ప్రస్తుతం తన పార్టనర్‌తో అమెరికాలో ఉన్న ఆమె గర్భవతిగా ఉన్నప్పటి ఫొటోలు చూసుకుంటూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది. ఆమె ఈ మధ్య తన పార్ట్‌నర్‌ మైఖేల్‌ డోలాన్‌తో కలిసి వాలెంటైన్స్‌ డే సెలబ్రేట్‌ చేసుకుంది. ప్రస్తుతం ఇలియానా హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

Iliana 2.jpg

Updated Date - Feb 20 , 2024 | 12:25 PM