Ileana D'Cruz: నటిగా పబ్లిక్‌ డొమైన్లో ఉన్నా.. కాబట్టి పట్టించుకోలేదు!

ABN , Publish Date - Mar 17 , 2024 | 08:32 PM

గోవా బ్యూటీ ఇలియానా(Ileana D'Cruz) సినిమాలకు కాస్త విరామం ఇచ్చి తన బిడ్డతో సరదాగా గడుపుతోంది. మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తెరపై కనిపించకపోయినా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది.

Ileana D'Cruz:  నటిగా పబ్లిక్‌ డొమైన్లో ఉన్నా.. కాబట్టి పట్టించుకోలేదు!

గోవా బ్యూటీ ఇలియానా(Ileana D'Cruz) సినిమాలకు కాస్త విరామం ఇచ్చి తన బిడ్డతో సరదాగా గడుపుతోంది. మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తెరపై కనిపించకపోయినా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది. తాజాగా తన ప్రియుడు, భాగస్వామి మైఖేల్‌ (Michel) గురించి పలు విషయాలు పంచుకున్నారు. ‘‘మైఖేల్‌ నా ఇష్టాలను గౌరవిస్తాడు. నా బిడ్డ కోవా ఫీనిక్స్‌ డోలన్‌ రాకతో తమ జీవితాలు అందం మారాయి. గత ఏడాది ఎంతో ఆనందంగా గడిచింది. నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచిపోయింది. ప్రెగ్నెంట్‌ అయ్యాక వర్క్‌ చేయాలనుకున్నా. పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నా. అప్పుడు అమ్మ అండగా నిలిచింది. ప్రసవానంతరం ఒత్తిడికి లోనయ్యా. నా భాగస్వామి మైఖేల్‌ సపోర్ట్‌ చేశాడు. మా బంధం గురించి పబ్లిక్‌గా చెప్పాలని లేదు. అలా చెప్పి గతంలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నా. నా గురించి ఏం మాట్లాడినా తట్టుకోగలిగా. నేను నటిగా పబ్లిక్‌ డొమైన్ లో  ఉన్నా కాబట్టి పట్టించుకోలేదు.  కానీ, నా భాగస్వామి, కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తట్టుకోలేను’’ అని అన్నారు ఇలియానా. హిందీలో ఆమె నటించిన 'దో ఔర్‌ దో ప్యార్‌’, 'తేర క్యా హోగా లవ్లీ’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Updated Date - Mar 17 , 2024 | 08:32 PM