War 2: హృతిక్‌ అప్‌డేట్‌ ఏంటంటే.. ! 

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:05 PM

హృతిక్‌ రోషన్  హీరోగా నటిస్తున్న 'వార్‌-2' చిత్రంలో  టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ భాగమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని హీరోతోపాటు నిర్మాణ సంస్థ కూడా అధికారికంగా వెల్లడించింది. హీరోలు ఇద్దరు పుట్టినరోజున  పరస్పరం శుభాకాంక్షలు చేసుకున్న సంగతి తెలిసిందే

War 2:  హృతిక్‌ అప్‌డేట్‌ ఏంటంటే.. ! 

హృతిక్‌ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న 'వార్‌-2' (War-2)చిత్రంలో  టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Jr Ntr) భాగమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని హీరోతోపాటు నిర్మాణ సంస్థ కూడా అధికారికంగా వెల్లడించింది. హీరోలు ఇద్దరు పుట్టినరోజున  పరస్పరం శుభాకాంక్షలు చేసుకున్న సంగతి తెలిసింది. అప్పుడు హృతిక్‌-తారక్‌ల సంభాషణలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌తో నార్త్‌లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్న తారక్‌ ఈ చిత్రంలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా వార్‌ 2 పై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు హృతిక్‌. ఇటీవలే ఫైటర్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ అందున్న ఆయన ప్రమోషన్లో  భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.  'వార్‌ 2' సినిమాపై అప్డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్‌లో ఎన్టీఆర్‌ ఇంకా అడుగు పెట్టలేదని చెప్పారు. ఎన్టీఆర్‌తో సాగే సన్నివేశాల చిత్రీకరణ త్వరలోనే ఉంటుందని, అందుకోసం ఆతురతగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ మార్చి మొదటి వారంలో ఉంటుంది, అప్పుడే తారక్‌ ఈ సెట్‌లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది ఫస్ట్‌ షెడ్యూల్‌ అనంతరం తారక్‌, హృతిక్‌ లపై ఇంటర్వెల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్‌ చేస్త్తారని.. అందుకు ఇప్పటికే భారీ సెట్‌ వేస్తున్నారని బాలీవుడ్‌ చెబుతోంది. ప్రస్తుతం తారక్‌ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. జాన్వీకపూర్‌ కథానాయిక. 

Updated Date - Jan 30 , 2024 | 05:05 PM