Fighter: అబ్బురపరిచే విజువల్స్ తో హృతిక్ 'ఫైటర్'.. మైండ్ బ్లోయింగ్‌గా ట్రైలర్

ABN , Publish Date - Jan 15 , 2024 | 01:41 PM

హృతిక్ రోషన్ తాజాగ న‌టిస్తున్న చిత్రం ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై అందరిని ఆక‌ట్టుకుంటున్న‌ది.

Fighter: అబ్బురపరిచే విజువల్స్ తో హృతిక్ 'ఫైటర్'.. మైండ్ బ్లోయింగ్‌గా ట్రైలర్
fighter

గతంలో ‘లక్ష్య’ చిత్రంలో ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గా మరచిపోలేని నటన కనబరిచిన హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్‌గా ఫైటర్ (Fighter) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై అందరిని ఆక‌ట్టుకుంటున్న‌ది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ డ్రాగన్స్ అనే స్పెషల్ టీమ్ కి లీడర్ గా షంషేర్ పఠానియ అలియాస్ పాట్టి అనే పాత్రలో హృతిక్ రోషన్ కనిపించ‌నున్నాడు. ఇంకా అనీల్ క‌పూర్ (Anil Kapoor),దీపిక ప‌దుకునే (Deepika Padukone) కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Hrithik.jpg

వార్, బ్యాంగ్ బ్యాంగ్ తర్వాత హృతిక్ రోషన్ (Hrithik Roshan) , సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇదే. సిద్దార్థ్ ఆనంద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏరియల్ యాక్షన్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఈ ఫైట‌ర్ నిల‌వ‌నుంది. అదేవిధంగా హృతిక్ రోషన్ నుంచి వస్తున్న తొలి 3డీ చిత్రం ఇదే. ఈ ఫైటర్(Fighter) మూవీని 3డీ ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందించారు. ఫైటర్ ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రేక్షకులకు అభిమానులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.


Roshan.jpg

ట్రైలర్‌లో ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) లుక్స్ సూపర్ స్టైలిష్ గా ఉండ‌డ‌మే గాక‌ యాక్షన్ సన్నివేశాలు ఊపిరి సలపని అనుభూతిని ఇచ్చేలా ఉన్నాయి. హృతిక్ రోషన్ పెర్ఫామెన్సే కాకుండా ఆయ‌న చెప్పే డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. 2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందుకు అనుగుణంగా హృతిక్ పాట్టి పాత్రని తీర్చిదిద్దారు. పుల్వామా అటాక్ సన్నివేశాలు.. దానికోసం తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరు రోజు ముందే అంటే జనవరి 25న ఫైటర్ (Fighter) చిత్రం రిలీజ్ అవుతోంది.

Updated Date - Jan 15 , 2024 | 03:05 PM