Emergency: డేట్‌ వచ్చేసింది.. కంగనా ఆశలన్నీ ఈ చిత్రంపైనే! 

ABN , Publish Date - Jan 23 , 2024 | 04:26 PM

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ చిత్రం విడుదల ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైనట్లు కంగనా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

Emergency: డేట్‌ వచ్చేసింది.. కంగనా ఆశలన్నీ ఈ చిత్రంపైనే! 

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం విడుదల ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైనట్లు కంగనా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ‘‘ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్‌ 14న ‘ఎమర్జెన్సీ’ రిలీజ్‌ అవుతుంది.  ఎమర్జెన్సీ నాకు చాలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌. ‘మణికర్ణిక’ తర్వాత నేను డైరెక్ట్‌ చేసిన రెండో సినిమా ఇది. ఈ పెద్ద ప్రాజెక్ట్‌ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థ్థాయిలో ప్రతిభావంతులు పని చేశారు. ఇదొక పీరియాడిక్‌ డ్రామా’’ అని కంగనా తెలిపారు. గతేడాది నవంబర్ 24న విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. కొంతకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న కంగనా ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. 

ఈ చిత్రం కోసం తనకు సంబంధించిన ఆస్తులన్నీ తనఖా పెట్టినట్లు కంగనా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా వ్యవహరించిన కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించారు. 


Updated Date - Jan 23 , 2024 | 04:26 PM