మహాదేవ్ ఫేమ్ పార్వతికి పెళ్లి, వరుడు ఎవరో తెలుసా...

ABN , Publish Date - Jan 20 , 2024 | 02:21 PM

అప్పుడెప్పుడో నిశ్చితార్ధం చేసుకున్న 'జాదూగాడు' తెలుగు సినిమాతో కథానాయికగా పరిచయం అయిన సొనారిక, వచ్చే నెల ఫిబ్రవరిలో తను ఎనిమిదేళ్ల నుండి డేటింగ్ లో వున్న తన ప్రియుడిని వివాహం చేసుకోబోతోంది.

మహాదేవ్ ఫేమ్ పార్వతికి పెళ్లి, వరుడు ఎవరో తెలుసా...
Mahadev serial fame Sonarika Bhadoria is all set to tie the knot

సొనారిక భడోరియా, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా! ఈమె 'మహాదేవ్' అనే పౌరాణిక సీరియల్‌లో శివుడు భార్య పార్వతి పాత్రలో కనిపించి టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం అయిన పేరు. ప్రతి ఇంట్లోనూ ఆమె పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆ పౌరాణిక సీరియల్ అంతగా విజయం సాధించింది. ఆ తరువాత సొనారిక తెలుగు సినిమా ప్రేక్షకులకి కూడా పరిచయం అయింది. మంచు విష్ణు, రాజ్ తరుణ్ నటించిన 'ఈడో రకం ఆడో రకం' సినిమాలో సొనారిక ఒక కథానాయకురాలిగా నటించింది.

అంతకు ముందు నాగ శౌర్య కథానాయకుడిగా నటించిన 'జాదూగాడు' సినిమాతో కథానాయకురాలిగా తెలుగు తెరకి పరిచయం అయింది సొనారిక. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన 'స్పీడున్నోడు' సినిమాలో కూడా కథానాయకురాలిగా నటించింది. కానీ ఆ తరువాత ఎందుకో ఆమెకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు, మళ్ళీ ముంబై వెళ్ళిపోయింది.

SonarikaBhadodaratiestheknot.jpg

2022లో సోనారిక తన ప్రియుడు, వ్యాపారవేత్త అయిన వికాస్‌ తో నిశ్చితార్థం చేసుకుంది, కానీ వివాహం ఎప్పుడు చేసుకుంటుంది అనే విషయం మాత్రం అప్పుడు చెప్పలేదు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఆమె తన వివాహాం ఫిబ్రవరి 18న చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్పుడెప్పుడో నిశ్చితార్ధం చేసుకున్న సోనారిక పెళ్లి ఇప్పుడు చేసుకోవాలని అనుకోవడం ఆసక్తికరం. అయితే వాళ్ళిద్దరి సామాజిక మాధ్యమాల్లో ఈ ఇద్దరూ కలిసి వున్న ఫోటోలు చాలానే పోస్ట్ చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు కోరిక మేరకి ఈ ఇద్దరూ ఇక వివాహం బంధంలోకి అడుగుపెట్టాలని భావించినట్టుగా తెలుస్తోంది. అందుకే ఫిబ్రవరిలో పెళ్లి ముహుర్తం ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 18న రాజస్తాన్‌లో వీరి వివాహం జరగనుందని, దీనికి దగ్గర బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. రాజస్తాన్‌ లోని రణతంబోర్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఘనంగా వీరి వివాహ వేడుక జరగనుందని అంటున్నారు. కానీ ఇంకా అధికారికంగా మాత్రం సమాచారం ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది.

2022 మే 19న తనకు కాబోయే భర్త వికాస్‌ తన చేతికి రింగ్‌ తొడిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆ పోస్ట్‌లో అతడికి బర్త్‌డే విషెస్‌ చెబుతూ తనకు కాబోయే భర్త అని ఆమె అనటం విశేషం. వీళ్లిద్దరూ చాలాకాలం పాటు డేటింగ్ లో వున్నారని వీరిద్దరి సన్నిహితులు అని చెబుతూ వుంటారు.

Updated Date - Jan 20 , 2024 | 02:49 PM