Deepika padukone: ఆ జాబితాలో ఏకైక భారతీయ నటి!

ABN , Publish Date - May 18 , 2024 | 10:34 AM

బాలీవుడ్‌ అగ్రతార దీపికా పదుకొణె అరుదైన గౌరవం దక్కింది. డెడ్‌లైన్స్‌ గ్లోబల్‌ డిస్‌రప్టర్స్‌ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఆ జాబితాలో దీపికా చోటు సంపాదించుకుంది.

Deepika padukone: ఆ జాబితాలో ఏకైక భారతీయ నటి!


బాలీవుడ్‌ అగ్రతార దీపికా పదుకొణె (Deepika padukone) అరుదైన గౌరవం దక్కింది. డెడ్‌లైన్స్‌ గ్లోబల్‌ డిస్‌రప్టర్స్‌ (Deadline's Global Disruptors 2024) హాలీవుడ్‌ మ్యాగజైన్‌ ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఆ జాబితాలో దీపికా చోటు సంపాదించుకుంది. ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటిగా దీపిక నిలిచింది. ఇటీవల ఈ జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. Deepika Padukone becomes first Indian star)

‘చేసిన పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించాలి. ఆ చిత్రం విజయం సాధించాలి. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురవాలి, మూవీ లవర్స్‌ కథనంతో పాటు సాగిపోయేలా కథలను ఎంపిక చేసుకోవాలి, అవార్డులు ప్రశంసలు దక్కాలి, మంచి పొజిషనలో ఉండాలి’ ఎక్కువమది తారలు కోరుకునేవి ఈవే. కానీ నా దృష్టిలో ముఖ్యమైనవి ఏమైనా ఉన్నాయంటే అది ఒక మంచి వ్యక్తిగా ఎదగడం, మంచి వ్యక్తులతో సమయం గడపడం, సెట్‌లోని అనుభవాలు మర్చిపోలేని జ్ఞాపకాలుగా గుర్తుచేసుకోవడం. ఇవే నాకు ముఖ్యం. ఇప్పుడీ గౌరవానికి కూడా కారణం అదే అని నా అభిప్రాయం. ప్రపంచం చాలా చిన్నదైపోయిందని నేను అనుకుంటున్నా. సినీ రంగంలోని అన్ని భాషల పరిశ్రమలన్నీ ఒక్కచోట చేరి ఈ ప్రపంచానికి గొప్ప కథలు చెప్పేందుకు సిద్థమవుతున్నాయి. మనం చెప్పే కథల వల్లే ఈ ప్రపంచంలో మార్పులు వస్తున్నాయని నేననుకోవటం లేదు. ప్రేక్షకులు మెచ్చేలా ఆసక్తికరమైన కథలు మాత్రమే మనం చెబుతున్నాం’’ అని అన్నారు.

Deepika.jpg

ఇంకా చెబుతూ ‘ఓం శాంతి ఓం’ సినిమా కోసం నేను ఆడిషన్ ఇవ్వలేదు. 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రంతోనే నేను బాలీవుడ్‌కి పరిచయమయ్యా. దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఏ ఆడిషన చేయకుండానే నన్ను ఎంపిక చేశారు. ఎందుకలా చేశారని ఆశ్చర్యపోయా(నవ్వుతూ). నాలో నాకే తెలియని ఓ స్టార్‌ ఉందని చెప్పడం, నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చామని ఈ చిత్రబృందం చెప్పాక చాలా ఆనందపడ్డాను. అలా మొదలైన నా ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నా. హిందీ చిత్ర పరిశ్రమలోనే కాదు. పదేళ్ల క్రితం నేను హాలీవుడ్‌ సినిమాలకు ఆడిషన్‌ ఇచ్చా. అక్కడంతా కొత్త విధానం. అక్కడ సినిమాలోని నటనకు తగ్గట్టు నేను ఫాన్సీ యాక్టింగ్‌ స్కూల్లో చేరలేదు, ఇంగ్లిస్‌ నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ ఒక్కసారి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లిష్‌ సినిమాలకి తగ్గ నైపుణ్యాలను నేర్చుకున్నా’’ అని చెప్పారు. 

Read More: Tollywood, Bollywood, Cinema News

Updated Date - May 18 , 2024 | 10:54 AM