షాక్‌.. దంగ‌ల్ న‌టి ఆక‌స్మిక మృతి

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:26 PM

బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. వ‌ర్ధ‌మాన న‌టి సుహాని భట్నాగర్ కొద్దిసేప‌టి క్రితం మృతి చెందారు.

షాక్‌.. దంగ‌ల్ న‌టి ఆక‌స్మిక మృతి
suhani

బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. వ‌ర్ధ‌మాన న‌టి సుహాని భట్నాగర్ (19) (Suhani Bhatnagar) ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చికిత్స పొందుతూ కొంత‌సేప‌టి క్రితం మృతి చెందారు. సుహానీ అంత్య‌క్రియ‌లు ఈ రోజు సాయంత్రం ఫ‌రిదాబాద్‌లోని అజ్రోండా శ్మశానవాటికలో జ‌రగ‌నున్న‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. సుహాని మ‌ర‌ణ‌వార్త విన్న అమీర్‌ఖాన్ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. అమె త‌ల్లిదండ్రులకు త‌న సానుభూతిని తెలియ‌జేశారు. ఈ మేర‌కు త‌న అమీర్‌ఖాన్‌ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ఎకౌంట్‌లో ఓ పోస్టు పెట్టారు.

GGh3-t4W8AAixvm.jpg


Dangal-Suhani-Bhatnagar.jpg

అమీర్‌ఖాన్ హీరోగా వ‌చ్చిన దంగ‌ల్ సినిమాలో చిన్న‌నాటి బ‌బితా ఫోగ‌ట్‌గా న‌టించిన సుహాని భట్నాగర్ (Suhani Bhatnagar) దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. కొద్ది సంవ‌త్స‌రాల క్రితం ఓ ప్ర‌మాదంలో సుహాని కాలు ఫ్య్రాక్చ‌ర్ అవ‌గా ఆమె వాడిన మందుల వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చి నెమ్మ‌దిగా శ‌రీరంలో నీరు చేర‌డం ప్రారంభించింది.

ఈ క్ర‌మంలో వాటికి మందులు వాడుతూ ట్రీట్‌మెంట్ తీసుకుంటోండ‌గా ఆ మందులు రియాక్ష‌న్ ఇచ్చాయి. హుటాహుటిన ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. దంగ‌ల్ సినిమా అనంత‌రం ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ చ‌దువుపైనే దృష్టి పెట్టిన ఈ న‌టి.. త‌ర్వాత ఏ చిత్రంలోను న‌టించ‌లేదు.

Updated Date - Feb 17 , 2024 | 04:47 PM