Ritika Singh: దానికి మించిన పాఠం మరొకటి ఉండదు

ABN , Publish Date - Jun 16 , 2024 | 09:50 AM

రితికా సింగ్‌ అంటే  ‘గురు’ సినిమా గుర్తొస్తుంది. ఆమె హీరోయిన్‌ కాకముందు.. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌. కిక్‌ బాక్సర్‌గా రాణించింది. ఈ అమ్మడి గురించి కొన్ని విశేషాలు... 

Ritika Singh: దానికి మించిన పాఠం  మరొకటి ఉండదు

రితికా సింగ్‌ (Ritika Singh) అంటే  ‘గురు’ (guru) సినిమా గుర్తొస్తుంది. ఆమె హీరోయిన్‌ కాకముందు.. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌. కిక్‌ బాక్సర్‌గా రాణించింది. ఈ అమ్మడి గురించి కొన్ని విశేషాలు... 

కర్లీ హెయిర్‌ కథానాయిక... జిమ్‌ ఫొటోలతో, వీడియోలతో అలరిస్తుంటోంది. రితికా సింగ్‌ పూర్తి పేరు రితికా మోహన్‌ సింగ్‌. తన ఇన్‌స్టా పేజీకి 44 లక్షల మంది ఫాలోవర్లున్నారు. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంది రితికా. డ్యాన్సు వీడియోలు, మాస్కుతో పబ్లిక్‌లోకి వెళ్లి రైల్లో ప్రయాణం చేయటం.. లాంటివి చేస్తుంటుంది. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండటం.. చిన్నప్పటి నుంచే అలవడిందట. (Actress Ritika singh)

అందుకే బాధపడేదాన్ని..

‘మేము ముంబైలోని అవుట్‌కట్స్‌లో ఉండేవాళ్లం. కాలేజీకి వెళ్లటానికి రెండు గంటల సమయం పట్టేది మెట్రోలో. ఎక్కువగా కాలేజీ క్లాసులో కూర్చోలేకపోయేదాన్ని. ఎందుకంటే కరాటేనే నా ప్రపంచం. మూడేళ్ల వయసులో కరాటే నేర్చుకోవటం ప్రారంభించా. మా నాన్న, తాతయ్యలు కరాటే, బాక్సింగ్‌ ఫీల్డ్‌నుంచి వచ్చారు. కాబట్టి నాకు అబ్బింది. మా అన్న కూడా మార్షల్‌ ఆర్ట్స్‌లో ఉన్నారు. ఉదయాన్నే లేవటం.. వ్యాయామం చేయటం చేసేదాన్ని. మా నాన్నే నాకు స్ఫూర్తి. ఇకపోతే కాలేజీ రోజుల్లో స్పోర్ట్స్‌ నా మొదటి ప్రయారిటీ. నాకెవరూ స్నేహితులు కూడా ఉండేవాళ్లు కాదు. స్నేహితులు లేకపోవటం వల్ల బాధపడేదాన్ని. నేను చదువలను నెగ్లెట్‌ చేయలేదు. డిగ్రీ చదివా. చేసే పనిలో వందశాతం ఇవ్వాలి’ అని అనుకుండేదాన్ని. రితికా సింగ్‌ నెగటివ్‌గా ఆలోచించే వాళ్లకు దూరంగా ఉండేదట. ఎవరూ మనకు ఏమీ చెప్పరు. తప్పులనుంచే తెలుసుకోవాలి. జీవితానుభవాలకు మించిన పాఠాలు ఉండవంటూ చెబుతుంది. అప్పుడప్పుడూ.. మోడివేషన్‌ స్పీకర్‌గా తన జీవిత విశేషాలను విద్యార్థులకు చెబుతుంటుందీమె.

Ritika singh.jpeg

అలా సినిమాల్లో అవకాశం..

‘బాక్సింగ్‌ చేస్తుంటే నటుడు మాధవన్‌గారు చూశారు. ఆయన రిఫరెన్స్‌తో ‘ఇరుదచుట్రు’ అనే బాక్సింగ్‌ నేపథ్యం కథలో నటించా. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను’ అంటుంది రితికా సింగ్‌. ఈ తమిళ సినిమా తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్‌ అయింది. విజయ్‌ సేతుపతితో ఓ సినిమాలో నటించింది. ఆ తర్వాత లారెన్స్‌ ‘శివలింగ’, ‘నీవెవరు’, ‘ఓ మై కాదవులే’ చిత్రాల తర్వాత ‘ఇన్‌కార్‌’ అనే హిందీ చిత్రంలో నటించింది. ముంబైలో పుట్టి పెరిగిన రితికా దక్షిణాది సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తమిళ స్టార్‌ రజనీకాంత్‌ ‘వెట్టయాన్‌’ షూటింగ్‌లో ఉంది. ‘స్టోరీ ఆఫ్‌ థింగ్స్‌’ వెబ్‌ సిరీస్ లో  గతేడాది నటించింది. మిక్స్‌డు కిక్‌ బాక్సింగ్‌లో పతకాలే కాకుండా.. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా. నిద్ర, వేళకు తినటం మర్చిపోను. ఎందుకంటే ఫిట్‌గా ఉండాలంటే ప్రణాళిక ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా కనీసం పదిహేను నిముషాలు వర్కవుట్స్‌ చేయందే కుదరదు’ అంటుంది రితికా సింగ్‌. 

Rit.png

Updated Date - Jun 16 , 2024 | 09:50 AM