Neha Sharma: ఆక్క‌డ ప్ర‌చారం క్లోజ్‌.. ఇక్క‌డ ఫ్రీ షో షురూ

ABN , Publish Date - May 27 , 2024 | 03:43 PM

నేహా శ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన పేరు. రామ్‌చ‌ర‌ణ్ చిరుత చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ సుంద‌రి ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో సెటిల‌యింది. నిత్యం ఫొటోషూట్ల‌తో త‌న అభిమానుల‌కు కంటెంట్ అందించ‌డంలో మాత్రం మిస్స‌వ‌డం లేదు.

Neha Sharma: ఆక్క‌డ ప్ర‌చారం క్లోజ్‌.. ఇక్క‌డ ఫ్రీ షో షురూ
neha sharma

Neha Sharma

నేహా శ‌ర్మ (Neha Sharma) తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన పేరు. 2007లో రామ్‌చ‌ర‌ణ్ చిరుత చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ సుంద‌రి ఆ త‌ర్వాత వ‌రుణ్ సందేశ్ కుర్రాడు చిత్రంలో న‌టించింది. ఆపై బాలీవుడ్ చెక్కేసి అక్క‌డ అడ‌పాద‌డ‌పా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటోంది.

as.jpg

ఎక్కువ‌గా విదేశాలు చుట్టి వ‌స్తూ, వివిధ బ్రాండ్ల‌కు ప్ర‌మోష‌న్స్ చేస్తూ క‌నిపించే ఈ ముద్దుగుమ్మ త‌ను న‌టించే సినిమాల క‌న్నా త‌న రెగ్యుల‌ర్ స్టైల్ డ్రెస్సింగ్‌తో ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటూ వ‌స్తోంది. ఎక్క‌డా త‌గ్గేదేలే అన్న చందాన ఎద‌ అందాల‌న్నీ క‌నిపించేలా ఫ్రీ షో చేస్తూ యువ‌త‌కు త‌న అందాల‌తో మ‌త్తెక్కిస్తోంది. అంతేకాదు కొన్ని సార్లు త‌న సోద‌రి న‌టి ఐషా శ‌ర్మ‌తో క‌లిసి (Aisha Sharma) చేసే ఫొటోషూట్లు చేస్తూ పోటీ ప‌డి మ‌రి త‌మ టాలెంట్‌తో కుర్ర‌కారుకు నిద్రను క‌రువు చేస్తున్నారు.

Neha Sharma

బీహ‌ర్‌లోని ఓ పాలిటిక్స్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన నేహా శ‌ర్మ (Neha Sharma) కొద్ది రోజుల క్రిత‌మే త‌న తండ్రి కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ‌ అభ్య‌ర్థి, సీఎల్పీ లీడ‌ర్‌ అజిత్ శ‌ర్మ (Ajit Sharma) కు మ‌ద్ద‌తుగా భాగల్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా ప్ర‌చారం, రోడ్డు షోలు నిర్వ‌హించి జాతీయ స్థాయిలో వార్త‌ల్లో నిలిచింది.

sharma.webp

అక్క‌డ ఎన్నిక‌లు ముగియ‌డంతో కొంత‌కాలం విశ్రాంతి తీసుకున్న ముద్దుగుమ్మ‌. ఇప్పుడు త‌న ఫీల్డ్‌కు తిరిగి వ‌చ్చి త‌న ఫొటోషూట్ల‌తో హీట్ పెంచుతోంది. ఈ క్ర‌మంలో త‌ను మెయిన్ లీడ్‌గా లాయ‌ర్‌గా న‌టిస్తోన్న ఇల్లీగ‌ల్ (illegalseason3) అనే కోర్టు డ్రామా వెబ్ సిరీస్ మూడో సీజ‌న్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో వెబ్ సిరీస్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంటూ త‌న అభిమానుల‌కు కంటెంట్ అందించ‌డంలో మాత్రం మిస్స‌వ‌డం లేదు.

ne sh.jpg


రీసెంట్‌గా ఈ ఇల్లీగ‌ల్ 3 (illegalseason3) ప్ర‌మోష‌న్ల‌లో కూడా త‌నదైన శైలి డ్రెస్సింగ్‌తోనే హ‌జ‌ర‌వుతున్న ఈ ముద్దుగుమ్మ అక్క‌డి వారిని చూపులు తిప్పుకోకుండా చేస్తోంది. ఇప్పుడు ఈ ఫొటోషూట్‌ ఫొటోలు నేహ శ‌ర్మ (Neha Sharma) త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Neha Sharma

సిరీస్ ప్ర‌మోష‌న్స్ కోసం ఇంత‌లా ప్ర‌ద‌ర్శ‌ణ చేస్తారా అంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే అందం, అభిన‌యం అన్నీ ఉన్నా అడవి కాచిన వెన్నెల‌లా ఇప్పుడు నేహాశ‌ర్మ (Neha Sharma) ప‌రిస్టితి ఉంది. సినిమా అవ‌కాశాలు అంత‌గా ద‌క్కించుకోలేక పోతున్న ఈ అమ్మ‌డికి ఇక‌నైనా భ‌విష్య‌త్‌లోనైనా ఛాన్సులు వ‌స్తాయోమో చూడాలి.

Updated Date - May 27 , 2024 | 03:50 PM