Boney kapoor: దయచేసి వేరే టాపిక్‌ మాట్లాడండి!

ABN , Publish Date - Apr 01 , 2024 | 05:48 PM

బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ ప్రస్తుతం ‘మైదాన్‌’ ప్రమోషన్సలో బిజీగా ఉన్నారు. అయన భార్యను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు 

Boney kapoor:  దయచేసి వేరే టాపిక్‌ మాట్లాడండి!

బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ (boney kapoor)ప్రస్తుతం ‘మైదాన్‌’ (maidan)ప్రమోషన్సలో బిజీగా ఉన్నారు. భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం జీవితాన్ని ఆధారంగా తెరకెక్కించిన చిత్రం  ‘మైదాన్‌’. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో నటించారు. ప్రియమణి కీలక పాత్ర పోషించారు. అమిత్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. అందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు బోనీకపూర్‌. తాజా ఇంటర్వ్యూ  తన సతీమణి, దివంగత శ్రీదేవి మరణం గురించి ప్రస్తావన రాగానే.. ఆమెను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ‘‘ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడొద్దు. ఇప్పటికీ ప్రతిరోజూ, ప్రతిక్షణం మిస్‌ అవుతూనే ఉన్నా. ఆమెను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని పేర్కొన్నారు. అని అన్నారు. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
Boney kapoor.jpeg

శిఖర్‌ పహారియా, జాన్వీకపూర్‌ (janhvey kapoor) రిలేషన్  గురించి ఆయన మాట్లాడారు. ‘‘పిల్లల వ్యక్తిగత జీవితాల గురించి నేను కామెంట్‌ చేయాలనుకోవడం లేదు. శిఖర్‌ అంటే నాకెంతో ఇష్టం. కొంతకాలం క్రితం వాళ్లిద్దరి మధ్య మాటలు లేనప్పుడు కూడా నేను అతడితో ఫ్రెండ్లీగా ఉన్నా. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా ముందు ఉంటాడు. జాన్వీ తో పాటు మా అందరితో స్నేహంగా ఉంటాడు’ అని అన్నారు.

‘‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ను మొదట ఐశ్వర్య రాయ్‌తో చేయాలనుకున్నారు. అదే చిత్రాన్ని దక్షిణాది భాషల్లో శ్రీదేవితో తెరకెక్కించాలని నిర్మాత బాల్కీ భావించాడు. అప్పుడు నేను అతడితో మాట్లాడా. ఈ కథకు శ్రీదేవి కంటే బాగా న్యాయం చేేసవాళ్లు ఎవరూ లేరని చెప్పాను’’ అని అన్నారు. 

Updated Date - Apr 01 , 2024 | 05:48 PM