Aamir Khan: మ‌రో ల‌గ్జ‌రీ ఇల్లు కొన్న.. అమీర్‌ఖాన్‌! ఎన్ని కోట్లంటే?

ABN , Publish Date - Jun 28 , 2024 | 08:52 AM

రీసెంట్‌గా ఓ బాలీవుడ్ స్టార్ కొత్త‌ ఇంటి వ్య‌వ‌హారం బాగా వార్త‌ల్లో నిలుస్తోంది. ఆ హీరో ఎవ‌రో కాదు మిష్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్.

Aamir Khan: మ‌రో ల‌గ్జ‌రీ ఇల్లు కొన్న.. అమీర్‌ఖాన్‌! ఎన్ని కోట్లంటే?
ameer khan

రీసెంట్‌గా ఓ బాలీవుడ్ స్టార్ కొత్త‌ ఇంటి వ్య‌వ‌హారం బాగా వార్త‌ల్లో నిలుస్తోంది. ఆ హీరో ఎవ‌రో కాదు మిష్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan). త‌రుచూ క‌రీనా క‌పూర్‌, ప్రియాంకా చోప్రా ఇలా త‌రుచూ క‌థ‌నాయిక‌ల ఇండ్లు, ఆపార్ట్‌మెంట్ల కొనుగోలు వ్య‌వ‌హారం బాగా చ‌ర్చ‌కు రావ‌డం కామ‌న్‌. కానీ ఈ సారి ఇందుకు విరుద్దంగా అమీర్ ఖాన్ ఈ జాబితాలోకి రావ‌డం విశేషం. ఇప్ప‌టికే అర డ‌జ‌నుకు పైగానే సొంత ఇండ్లు ఉన్న ఆయ‌న తాజాగా ముంబైలోని చాలా ఖ‌రీదైన పలిహలి ఏరియాలో ఓ సూప‌ర్ లగ్జరీ రెడీ టు మూవ్‌ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన‌ట్లు జాతీయ‌ మీడియా బాగా ప్ర‌చారం చేస్తోంది.

Aamir-Khan-Freeda-Apartments.jpg

1027 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాతో ఉన్నఆ ఇంటిని అమీర్ ఖాన్ (Aamir Khan) రూ. 9.75 కోట్లకు జూన్‌ 25న కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఇందుకు గాను రూ. 58.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించిన‌ట్లు స‌మాచారం. ఇదిలాఉండ‌గా ఇప్ప‌టికే అమీర్ ఖాన్‌కు అదే ప్రాంతంలోని మెరీనా. బెల్లాబిస్టా అపార్ట్‌మెంట్ల‌లోనూ ఇండ్లు ఉన్నాయి. అంతేగాక బాంద్రాలో సముద్రం ఒడ్డున 5వేల చదరపు అడుగుల భారీ భవంతి, పంచ్‌గనిలో రెండెకరాల విస్తీర్ణంలో ఫామ్‌హౌస్‌, ఇవి కాకుండా యూపీ, ఢిల్లీల్లోనూ మంచి ఆస్తులు ఉన్న‌ట్లు మీడియాలు వెళ్ల‌డిస్తున్నాయి.


aamirkhanfamily151584180078.webp

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే అమీర్ ఖాన్ (Aamir Khan) చివ‌రిగా 2022లో వ‌చ్చిన లాల్ సింగ్ చ‌ద్దా (Laal Singh Chaddha) చిత్రంలో న‌టించారు. తాజాగా ఆయ‌న త‌న మాజీ భార్య కిర‌ణ్ రావు ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన లాప‌టా లేడిస్ (Laapataa Ladies) సినిమా సంచ‌ల‌న విజయం సాధించి మంచి పేరు తీసుకు వచ్చింది.

reena.jpg

ఇక రీసెంట్‌గా గ‌తంలో త‌నే నిర్మించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తారే జ‌మీన్ ప‌ర్ చిత్రానికి సీక్వెల్ సితారే జ‌మీన్ ప‌ర్ (Sitaare Zameen Par) అనే మూవీని నిర్మిస్తున్నారు. ఇక అమీర్ ఖాన్ (Aamir Khan) ఫ్యామిలీ విష‌యానిక వ‌స్తే ఆయ‌న కూతురు ఇటీవ‌లే ఓ జిమ్ ట్రైన్‌ను వివాహం చేసుకోగా, ఆయ‌న పెద్ద‌ కుమారుడు జునైద్ ఖాన్ మ‌హారాజ్ అనే హిందీ సినిమాతో గ‌త వార‌మే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

aamir-khan-junaid.webp

Updated Date - Jun 28 , 2024 | 08:52 AM