Shah Rukh Khan: షారుఖ్‌ఖాన్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

ABN , Publish Date - May 22 , 2024 | 10:25 PM

ప్ర‌ముఖ న‌టుడు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న‌ను గుజ‌రాత్ అహ్మాదాబాద్‌లోని కేడీ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Shah Rukh Khan: షారుఖ్‌ఖాన్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు
Shah Rukh Khan

ప్ర‌ముఖ న‌టుడు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) అస్వ‌స్థ‌కు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న‌ను గుజ‌రాత్ అహ్మాదాబాద్‌లోని కేడీ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఐపీఎల్ టీమ్‌కు య‌జ‌మాని అయిన షారుక్ (Shah Rukh Khan) నిన్న బుధ‌వారం స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మొద‌టి ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ కోసం నిన్న అహ్మ‌దాబాద్‌కు వ‌చ్చారు. మ్యాచ్‌లో విజ‌యం సాధించిన అనంత‌రం అక్క‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. రాత్రి అక్క‌డే బ‌స చేశారు.

Shah Rukh Khan.jpeg


అయితే నిన్న అహ్మాదాబాద్‌లో ఎండ తీవ్ర‌త‌తో షారుఖ్ వ‌డ‌దెబ్బ‌కు గుర‌వ‌డంతో పాటు మైల్డ్ హాట్‌స్ట్రోక్ రావడంతో వెంట‌నే కేడీ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ప్ర‌స్తుతం షారుఖ్ (Shah Rukh Khan) ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ద‌ని, ఎలాంటి భ‌యం లేద‌ని వైద్యులు తెలియ‌జేశారు.

ఈక్ర‌మంలో తోటి ఐపీఎల్ టీమ్ స‌హ య‌జ‌మాని జూహీచావ్లా ఆస్ప‌త్రికి వ‌చ్చి షారుఖ్ (Shah Rukh Khan) ను ప‌రామ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ఆస్ప‌త్రి చుట్టూ పోలీసులు భారీ బందోబ‌స్త్ ఏర్పాటు చేశారు. దేశ‌వ్యాప్తంగా అభిమానులు షారుఖ్ (Shah Rukh Khan) త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. షారుఖ్ ఆరోగ్యంపై ఆస్ప‌త్రి యాజ‌మాన్యం అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

Updated Date - May 22 , 2024 | 10:50 PM