Kriti Sanon: అక్క‌డ ల‌గ్జ‌రీ ఫ్లాట్ కొన్న ఆదిపురుష్ బ్యూటీ.. అమితాబ్‌, షారుఖ్‌ల‌కు ధీటుగా!

ABN , Publish Date - Jul 11 , 2024 | 06:47 PM

వ‌రుస చిత్రాతో చాలా బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్.. తాజాగా దేశ వ్యాప్తంగా వార్త‌ల్లోకెక్కింది. అతి కొద్దిమందికి మాత్ర‌మే సాధ్య‌మైన ఓ విలువైన ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసి హాట్ టాపిక్‌గా మారింది.

Kriti Sanon

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు కృతి స‌న‌న్ (Kriti Sanon). సుకుమార్, మ‌హేశ్‌బాబు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ వ‌న్ నేనొక్క‌డినే అనే తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగ‌మ్మ ఆ తర్వాత తన మకాం బాలీవుడ్ కు మార్చి అక్క‌డే సెటిల్ అయిపోయింది. ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ ఆగ్ర క‌థానాయిక‌ల లిస్టులో చేరింది. మిగ‌తా ఏ న‌టికి లేన‌న్ని అవ‌కాశాల‌తో చేతినిండా సినిమాల‌తో నెంబ‌ర్ వ‌న్ పోజిష‌న్‌లో దూసుకుపోతుంది. గ‌త సంవ‌త్స‌రం ప్ర‌భాస్ ఆది పురుష్ సినిమాలో సీత‌గా మెప్పించిన కృతి త‌ర్వాత మ‌రో నాలుగు హిందీ సినిమాల‌తో ఆకట్డ‌కోవడమే కాక ఉత్త‌మ న‌టిగా నేష‌న‌ల్ అవార్డు అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

Kriti-Sanon.jpg

ప్రస్తుతం వ‌రుస చిత్రాతో చాలా బిజీగా ఉన్న కృతి స‌న‌న్ (Kriti Sanon) తాజాగా దేశ వ్యాప్తంగా వార్త‌ల్లోకెక్కింది. అతి కొద్ది ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన ఓ చాలా విలువైన ప్రాంతంలో భూమిని కొనుగోలు చేసి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు బాలీవుడ్‌ స్టార్స్ అమితాబ్ బ‌చ్చ‌న్ ( Amitabh Bachchan), షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan), ఆయ‌న కూత‌రు సుహానా ఖాన్ (Suhana Khan), ర‌ణ్ వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా ప‌దుకుణే (Deepika Padukone) ల‌కు మాత్ర‌మే అక్క‌డ విలువైన అస్తులు ఉండ‌గా ఇప్పుడు ఆ లిస్టులో కృతి స‌న‌న్ చేరింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై స‌మీపంలోని అలీబాగ్‌లో (Alibaug) బీచ్ ఒడ్డున అభినంద‌న్ లోధా (Abhinandan Lodha) (HoABL) వెంచ‌ర్‌లో 2000 sq ft ల‌గ్జ‌రీ స్ట‌లాన్ని కొనుగోలు చేసింది. దాని విలువ రూ. 2 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని స‌మాచారం.

most-alluring-enclave.jpg


ఈ సంద‌ర్భంగా కృతి (Kriti Sanon) మాట్లాడుతూ.. ఎట్ట‌కేల‌కు నాకు గ‌ర్వంగా ఉంది నేను ఓ స్థలానికి ఓన‌ర్‌ను అయ్యాన‌ని, అంత ప్ర‌ముఖ‌మైన సిటీ సెంట‌ర్‌లోని లోథా వెంచ‌ర్‌లో ప్లాట్ తీసుకోవ‌డంపై నా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారని పేర్కొంది. కాగా ఇప్ప‌టికే కృతికి గోవా, బెంగ‌ళూరుల్లో ఖ‌రీదైన అస్థులు ఉన్న‌ట్లు స‌మాచారం.

alibaug-abhinandan-lodha-house-land-project-slide1-mobile.webp

ఇదిలాఉండ‌గా కొద్ది రోజుల క్రితం ఇదే వెంచ‌ర్‌లో అమితాబ్ 10వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని కొనుగోలు చేసిన‌ట్లు దాని విలువ రూ.10 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని, షారుఖ్ ఖాన్ రూ.15 కోట్లకు పైగా విలువైన‌ 20,000 చదరపు మీటర్ల స్థ‌లం, సుహానా ఖాన్ రూ.12.5 కోట్ల‌కు పైగా విల‌వైన‌ 1.5 acres వ్య‌వ‌సాయ భూమిని కోనుగోలు చేసిన‌ట్లు బాలీవుడ్‌లో, జాతీయ మీడియాల్లో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

lodha-pix.webp

ఇదిలా ఉండగా ఇప్ప‌టికే కృతి న‌టించిన తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా (Teri Baaton Mein Aisa Uljha Jiya), క్రూ (Crew) చిత్రాలు ఇప్ప‌టికే విడుద‌లై వంద కోట్ల క్ల‌బ్ లో చేరి సంచ‌ల‌నం సృష్టించాయి. ప్ర‌స్త‌తం మ‌రో మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

Updated Date - Jul 11 , 2024 | 06:47 PM