Bobby deol: సవాళ్లకు దూరంగా ఉంటే అలాంటి నష్టాలే..

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:54 PM

‘యానిమల్‌’ (Animal) సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (bobby deol). ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.

Bobby deol: సవాళ్లకు దూరంగా ఉంటే అలాంటి నష్టాలే..

‘యానిమల్‌’ (Animal) సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (bobby deol). ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. హిందీ చిత్రాల్లోనే కాకుండా తమిళ, తెలుగులో సినిమాల్లో కూడా అవకాశం అందుకున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో  బాలీవుడ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘సినిమాల ఎంపికలో కొన్నిసార్లు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేం. మరికొన్నిసార్లు దర్శక, నిర్మాతల వల్ల కూడా అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సవాళ్లను స్వీకరించకూడదు అనుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. కంఫర్టు జోన్‌ నుంచి బయటకు వచ్చి పాత్రలను ఎంపిక చేసుకోవాలి. నేను దాని నుంచి బయటకు వచ్చి నటించాలని నిర్ణయించుకున్నా. ఏ పాత్రనైనా నమ్మకంతో చేస్తాను. మనం సవాళ్లను ఎదుర్కోకూడదనుకుంటే మన చుట్టూ ఉండే వాళ్లు సలహాలిస్తుంటారు. ఇండస్ట్రీలో వచ్చే మార్పును ముందే గమనించి దానికి తగినట్లు సినిమాలను ఎంపిక చేసుకోవాలి. మనల్ని మనం నమ్మడం ప్రారంభిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది’’ అని అన్నారు. బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించనున్న ఎనబీకే109’లో నటిస్తున్నారు. దీనికోసం బాబీ ఇప్పటికే తన లుక్‌ మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సూర్య హీరోగా రూపొందుతోన్న ‘కంగువా’లో కనిపించనున్నారు. పవనకల్యాణ్‌ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు’ చిత్రంలో ఔరంగజేబుగా నటిస్తున్నారు.  

Updated Date - Jun 18 , 2024 | 05:09 PM