Atlee: భారతీయ సినీ పరిశ్రమకు మరో రూపం!

ABN , Publish Date - Feb 24 , 2024 | 05:56 PM

షారుక్‌ఖాన్(shah rukh khan) హీరోగా అట్లీ (Atlee) దర్శకత్వం వహించిన ‘జవాన్‌’ (Jawan) చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే!

Atlee: భారతీయ సినీ పరిశ్రమకు మరో రూపం!

షారుక్‌ఖాన్(shah rukh khan)  హీరోగా అట్లీ (Atlee) దర్శకత్వం వహించిన ‘జవాన్‌’ (Jawan) చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే! బాక్సాఫీస్‌ వద్ద కోట్ల వసూళ్లు రాబట్టింది. దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఉత్తమ నటీనటులుగా షారుక్‌ఖాన్‌, నయనతార అవార్డులు అందుకున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అట్వీ మాట్లాడుతూ "షారుక్‌ఖాన్‌తో మరో సినిమా చేయాలనుంది. ఆయన నటించిన 'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌', 'డీడీఎల్‌జే' సినిమాలంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి వర్క్‌ చేయాలన్నది నా కల. ‘జవాన్‌’ రూపంలో దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చాడు. భారతీయ సినీ పరిశ్రమకు మరో రూపమైన ఆయనతో కలిసి వర్క్‌ చేయాలనుంది. నా జీవితంలో నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరాయన. నన్ను ఎంతో అభిమానిస్తారు. ఎప్పుడూ చాలా ఎనర్జీగా, ఉత్సాహంగా ఉంటారు. జవాన్‌ కంటే గొప్ప కథ కుదిరితే కచ్చితంగా షారుక్‌ ఖాన్‌తో వర్క్‌ చేస్తా’’’ అని అట్లీ చెప్పారు.



ఈ సినిమా షూటింగ్‌ ఎక్స్‌పీరియెన్స గురించి మాట్లాడుతూ షూటింగ్‌ టైమ్‌లో షారుక్‌ఖాన్‌ దగ్గర ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఓపికతో షూటింగ్‌ చేయడం, ప్రతీ సన్నివేశం అనుకున్న విధంగా తెరకెక్కించాలి, అప్పుడు ఆ సినిమా విజయం వరిస్తుందని ఆ సినిమా ద్వారా అనుభవంలోకి వచ్చింది’’ అని ఆయన అన్నారు. గత ఏడాది ప్రారంభంలో ‘జవాన్’, ‘పఠాన్‌’ వరుస చిత్రాలతో బాక్సాఫీస్‌ హిట్‌ అందుకున్నారు షారుక్‌. గత ఏడాది చివర్లో 'డంకీ’ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన సంజయ్‌లీలా బన్సాలీతో ఓ చిత్రం చేస్తున్నారు. ‘పఠాన్‌-2’ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Updated Date - Feb 24 , 2024 | 05:57 PM