AR Murugadoss : సల్మాన్ తో భారీ యాక్షన్ చిత్రం!

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:42 PM

దక్షిణాది అగ్ర దర్శకుల్లో ఒకరైన ఏఆర్‌ మురుగదాస్‌ (AR Murugadoss) కొంతగ్యాప్‌ తర్వాత తన నూతన చిత్రాన్ని ప్రకటించారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman khan) హీరోగా ఓ చిత్రం చేయనున్నట్లు ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

AR Murugadoss :  సల్మాన్ తో భారీ యాక్షన్ చిత్రం!

దక్షిణాది అగ్ర దర్శకుల్లో ఒకరైన ఏఆర్‌ మురుగదాస్‌ (AR Murugadoss) కొంతగ్యాప్‌ తర్వాత తన నూతన చిత్రాన్ని ప్రకటించారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman khan) హీరోగా ఓ చిత్రం చేయనున్నట్లు ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. బాలీవుడ్‌లో ఇప్పటికే ఆయన ఆమిర్‌ఖాన్‌తో 'గజని’ చిత్రాన్ని రీమేక్‌ చేసి హిట్‌ కొట్టారు. ఇటీవల కోలీవుడ్‌ హీరో విజయ్‌, శివ కార్తికేయన్‌ వంటి స్టార్‌ హీరోలతో మురగదాస్‌ సినిమా తీస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అవి వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో సినిమా చేేస చాన్స్‌ ఆయనకు దక్కింది. ఇదే విషయాన్ని సల్మాన్ ఖాన్ కూడా ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.  

"టాలెండెట్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌, నా మిత్రుడు సాజిద్‌ నదియావాలాతో కలిసి ఎగ్జైటింగ్‌ సినిమాకు పని చేయబోతున్నా. ఈ కలయిక నాకెంతో ప్రత్యేకం. అందరి ఆశీస్సులతో జర్నీ ముందుకు సాగాలని కోరుతున్నా. 2025 రంజాన్ పండుగకు  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని తెలిపారు. అయితే ఈ చిత్రం మురుగదాస్‌ తరహాలో చక్కని సందేశంతోపాటు పూర్తిస్థాయి యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ యాక్షన్‌ చిత్రం కోసం ఎఆర్‌ మురుగదాస్‌ చాలా కాలంగా స్క్రీన్ ప్లే వర్క్ చేస్తున్నారు. ఈచిత్రంతో మురుగదాస్ కమ్‌ బ్యాక్‌ ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు.  

Updated Date - Mar 12 , 2024 | 03:42 PM