Animal Park : ‘యానిమల్’ పార్క్ మొద‌ల‌య్యేది అప్పుడే.. స్ఫ‌ష్టం చేసిన సందీప్‌రెడ్డి!

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:07 AM

సందీప్‌రెడ్డి వంగా రణ్‌బీర్‌ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఆ చిత్రం ఉహించిన దానిక‌న్నా మంచి విజ‌యం సాధించ‌డంతో పార్ట్ 2 పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మేక‌ర్స్ కూడా దానికి సీక్వెల్ ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందని సినిమా చివ‌ర‌లో హింట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Animal Park : ‘యానిమల్’ పార్క్ మొద‌ల‌య్యేది అప్పుడే.. స్ఫ‌ష్టం చేసిన సందీప్‌రెడ్డి!
animal park

అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్ చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) బాలీవుడ్ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’ (Animal) ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఆ చిత్రం ఉహించిన దానిక‌న్నా మంచి విజ‌యం సాధించ‌డంతో పార్ట్‌2పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మేక‌ర్స్ కూడా దానికి సీక్వెల్ ‘యానిమల్‌ పార్క్‌’ ఉంటుందని సినిమా చివ‌ర‌లో హింట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ యానిమల్ పార్ట్‌2కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్న‌ది. యానిమ‌ల్ పార్క్‌ (Animal Park) 2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని, ఈక్ర‌మంలో ఈ ఫిబ్రవరిలోనే స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన న‌టీన‌టుల ఎంపిక‌లోనూ సందీప్ బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌తో స్పిరిట్‌, అల్లు అర్జున్‌తో, చిరంజీవిల‌తో సినిమాలు లైన్‌లో ఉండ‌డంతో ఇందులో ఎదైనా ఒక చిత్రాన్ని ఈ ఏడాది పూర్తి చేసి వ‌చ్చే సంవ‌త్స‌రం యానిమ‌ల్ పార్క్ షూటింగ్ పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది.


ఇటీవ‌ల ఓ మీడియాతో సందీప్ మాట్లాడుతూ యానిమాల్ పార్క్‌లో మొద‌టి భాగంకు మించిన పాత్ర‌లు, భావోద్వేగాలు, ఉండ‌డంతో పాటు ఎక్కువ థ్రిల్ చేసే అంశాలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ర‌ణ‌బీర్ పాత్ర అంత‌కు మించి అనేలా ఉంటుంద‌ని, అంతేగాక ఈ సినిమాను మూడు భాగాల్లో తీసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో ర‌ణ‌బీర్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించండంతో పాటు ఆయ‌న‌ త‌ర‌హా క్యారెక్ట‌ర్లు రెండు మూడు ఈ సినిమాలో ఉండ‌బోతాయ‌ని అందుకే ఈ సినిమాకు యానిమ‌ల్ పార్క్ అని పెట్టిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా యానిమ‌ల్‌లో బోల్డ్‌గా న‌టించిన‌ త్రిప్తి డిమ్రికి సీక్వెల్ లో పాత్ర నిడివి ఎక్కువ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 01 , 2024 | 10:34 AM