OTT Issues: సమన్లు జారీ... కోర్టులో వివాదం

ABN , Publish Date - Jan 21 , 2024 | 04:14 PM

రణ్‌బీర్‌ కపూర్‌, నేషనల్‌క్రష్‌ రష్మిక మందన్నా జంటగా నటించిన ‘యానిమల్‌’ ఎంతగా హిట్‌ అయిందో తెలిసిందే! అర్జున్ రెడ్డి ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

OTT Issues:  సమన్లు జారీ... కోర్టులో వివాదం

రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir kapoor), నేషనల్‌క్రష్‌ రష్మిక మందన్నా (Rashmika mandanna) జంటగా నటించిన ‘యానిమల్‌’ (Animal) ఎంతగా హిట్‌ అయిందో తెలిసిందే! అర్జున్ రెడ్డి ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తండ్రీ- కొడుకు సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమా  ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్  అవుతోందా? అని ఎదురుచూస్తున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌  ప్రయత్నాలు చేస్తున్నారట. జనవరి 26 నుంచి యానిమల్‌ స్ట్రీమింగ్ (OTT Streaming) కానుందని నెట్టింట వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం రన టైమ్‌ కాస్త ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది. యానిమల్‌ రన్‌టైమ్‌ మూడున్నర గంటలు ఉండటంతో ప్రేక్షకుల ఇబ్బంది పడుతారని భావించి సుమారు సుమారు తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్‌ చేసినట్లు సందీప్‌ రెడ్డి గతంలో తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌ వెర్షన్‌ కోసం ఎడిటింగ్‌ చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. థియేటర్‌ కోసం తొలగించిన కొన్ని సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌కు యాడ్‌ చేస్తున్నట్లు ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందులో రష్మికతో రణ్‌బీర్‌ లిప్‌లాక్‌ సీన్స్‌ కూడా ఉన్నట్లు సమాచారం. 

ఓటీటీ చిక్కులు..

యానిమల్‌ చిత్రాన్ని టి-సిరీస్‌ ఫిల్మ్స్‌, భద్రకాళి పిక్చర్స్‌, సినీ1 స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే! ఇందులో సినీ1 స్టూడియోస్‌ ‘యానిమల్‌’ ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్‌ శాటిలైట్‌ హక్కుల విషయంలో సూపర్‌ క్యాసెట్స్‌ ఇండస్ట్రీ  ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్లూవర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్‌ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ వివాదం ఈ నెల 20న వివరణ ఇవ్వాలని న్యాయస్థ్థానం కోరింది. జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరగనుంది. దాంతో ఈ చిత్రం ఓటీటీ సీ్ట్రమింగ్‌ వాయిదాలో ఉంది. 


Updated Date - Jan 21 , 2024 | 04:35 PM