Amitabh Bachchan: ఈ వేడుక ఓ గొప్ప అనుభవం

ABN , Publish Date - Mar 04 , 2024 | 07:19 PM

అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకలు అద్భుతంగా ఉన్నాయని బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్(Amitabh Bachchan) అన్నారు. పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చెంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్, జామ్‌నగర్‌లో ఘనంగా జరిగాయి.

Amitabh Bachchan:  ఈ వేడుక ఓ గొప్ప అనుభవం

అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకలు అద్భుతంగా ఉన్నాయని బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్(Amitabh Bachchan) అన్నారు. పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చెంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్, జామ్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా సినీ తారలు పాల్గొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబ సమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. తిరిగి ముంబయి వెళ్తూ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని రాసుకొచ్చారు. ‘అట్టహాసంగా నిర్వహించిన వేడుకలతోపాటు వంతారా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రశంసనీయం. ఈ వేడుకలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. వంతారా సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం. గాయపడిన జంతువుల్ని కాపాడటం, చికిత్స అందించి వాటికి పునరావాసం ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారు. ఇలాంటి ఒక కృత్రిమ అడవిని ఏర్పాటు చేసి వన్యప్రాణులను కాపాడాలన్నది మంచి ఆలోచన. మీరందరూ దీనిని సందర్శించాలి. ఇదో గొప్ప అనుభవం’’ అని అమితాబ్‌ బచ్చన్‌ పేర్కొన్నారు. (Ambani's Son wedding)

అనంత్‌-రాధికల ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో రణ్‌బీర్‌-అలియా, దీపికా-రణ్‌వీర్‌ సింగ్‌, కరీనా కపూర్‌-సైఫ్‌ అలీ ఖాన్‌ తదితర బాలీవుడ్‌ జంటలు ప్రత్యేకంగా డ్యాన్స్‌ చేసి సందడి చేశాయి. బాలీవుడ్‌ ఖాన్స్‌ త్రయం సల్మాన్‌, షారుక్‌, ఆమిర్‌తో కలిసి హీరో రామ్‌ చరణ్‌ ‘నాటునాటు’ పాటకు స్టెప్పులేసి అలరించారు.  అక్షయ్‌కుమార్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే, సారా అలీఖాన్‌, ఖుషీ కపూర్‌ ’భోలే చూడియా’ సాంగ్‌కు స్టెప్పులేశారు.

Updated Date - Mar 04 , 2024 | 07:19 PM