Alia Bhatt: కథల ఎంపికలో రాజమౌళి చెప్పిందే చేస్తున్నా!

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:54 PM

బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ (Alia Bhatt)టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళిపై (Rajamouli) కీలక వ్యాఖ్యలు చేశారు. కథ, సినిమాల ఎంపికలో తనకు రాజమౌళి సలహా ఇచ్చారని తెలిపారు. ఆయన దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో(RRR) నటించిన మెప్పించారు అలియా.

Alia Bhatt: కథల ఎంపికలో రాజమౌళి చెప్పిందే చేస్తున్నా!

బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ (Alia Bhatt)టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళిపై (Rajamouli) కీలక వ్యాఖ్యలు చేశారు. కథ, సినిమాల ఎంపికలో తనకు రాజమౌళి సలహా ఇచ్చారని తెలిపారు. ఆయన దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో(RRR) నటించిన మెప్పించారు అలియా. తాజాగా ఓ వేదికపై ఆమె మాట్లాడుతూ ‘‘సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో నేను మొదటి నుంచి ఒత్తిడికి గురవుతుంటా. అదే విషయాన్ని ఓసారి  రాజమౌళికి చెప్పాను. ‘ఏది ఎంచుకున్నా ప్రేమతో చేయండి. అప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులు మీ నటనను ప్రశంసిస్తారు. మీకు కనెక్ట్‌ అవుతారు. ఈ ప్రపంచంలో ప్రేమతో  చేసే  పనికి మించిన గొప్పది ఏదీ లేదు’ అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి అదే పాటిస్తున్నా. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నా వద్దకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పేదాన్ని. నిజం చెప్పాలంటే నాకు సహనం తక్కువ. ఇప్పుడు ఆ పద్ధతి మారింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎంత కష్టమైన పాత్రనైనా అంగీకరించాలని నిర్ణయించుకున్నా’’ అని అలియా అన్నారు.

Alia.jpg

ప్రస్తుతం అలియా కీలక పాత్రలో   ‘జిగ్రా’ రూపొందుతోంది. వాసన్‌ బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన ప్రొడక్షన్స్‌పై కరణ్‌ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Mar 14 , 2024 | 05:19 PM