Aditi Rao Hydari: మైదానంలో చిన్నపిల్లల్లా ఉండడమే మంచి మార్గం

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:55 PM

"నటీనటులపై దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay leela Bhansali) చూపించే ప్రేమ, ఆప్యాయత అపారం. హీరోయిన్లను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. ఆయనతో పని చేస్తున్నప్పుడు మైదానంలో చిన్నపిల్లల్లా ఉండడమే ఉత్తమ మార్గం

Aditi Rao Hydari:  మైదానంలో చిన్నపిల్లల్లా ఉండడమే మంచి మార్గం

"నటీనటులపై దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay leela Bhansali) చూపించే ప్రేమ, ఆప్యాయత అపారం. హీరోయిన్లను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. ఆయనతో పని చేస్తున్నప్పుడు మైదానంలో చిన్నపిల్లల్లా ఉండడమే ఉత్తమ మార్గం’’ అని  అదితీరావు హైదరి (Aditi Rao Hydari) అన్నారు. 'స్వేచ్ఛ కోసం అందాన్ని ఆయుధంగా ఉపయోగించుకునే ఆర్ట్‌ ఈ బిబ్బోజాన్‌కు మాత్రమే తెలుసు’’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ (heeramandi) ట్రైలర్‌లో తన పాత్రను పరిచయం చేసిన ఆమె తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు సంజయ్‌లీలా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘‘నా ఇష్టమైన దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలి ఒకరు. ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘పద్మావత్‌’లోనూ నటించాను. మళ్లీ ఆయనతో కలిసి పని చేసే రోజు కోసం ఎదురు చూశాను. సినిమాల్లో ఆయన స్రీలను చూపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్లు ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రతీకారం తీర్చుకోగలరు. ఆ విధంగా పాత్రలను తీర్చదిద్దగల టాలెంట్‌ కేవలం సంజయ్‌ సర్‌కు మాత్రమే ఉంది. ఒకే పాత్రను భిన్నమైన కోణాల్లో చూపిస్తుంటారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కాలేదు. నిజానికి ఈ ‘హీరామండీ’ కథ గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. కానీ.. మనల్ని ఆ పాత్రలో లీనమయ్యే వాతావరణాన్ని సృష్టిస్తారు ఆయన. నటీనటులపై ఆయన చూపించే ప్రేమ, ఆప్యాయత అపారం. ఆయన హీరోయిన్లను కన్నబిడ్డల్లా చూసుకుంటారు. ఆయనతో పని చేస్తున్నప్పుడు మైదానంలో చిన్నపిల్లల్లా ఉండడమే ఉత్తమ మార్గం’’ అని చెప్పారు అదితీరావు హైదరి.

Heeramandi.jpg

ప్రేమపై నమ్మకం ఎక్కువ
‘‘హీరామండీ’ చిత్రంలో ప్రతి పాత్ర ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటుంది. ఇందులో నేను బిబ్బోజాన్‌ అనే వేశ్య పాత్రలో కనిపించబోతున్నాను. బిబ్బోజాన్‌ స్వచ్ఛమైన మనసు ఉన్న మహిళ. ఆమెలో భిన్నమైన భావోద్వేగాలుంటాయి. కానీ ఆమె ఎక్కడ పుట్టిందో ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యలా మారిందో తెలియని అయోమయంలో ఉంటుంది. ఇందులో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత దూరమైన వెళ్తుంది. వ్యక్తిగతంగా నేను కూడా అంతే. మా ఇంట్లో నాకు ప్రతి విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. చిన్నప్పటి నుంచి నాకు ప్రేమపై నమ్మకం ఎక్కువ. ఈ సిరీస్‌లోని నా పాత్ర మాదిరిగానే నేను కూడా దేని గురించైనా ధైర్యంగా మాట్లాడతాను’’ అని అన్నారు.

Heeramandi-2.jpg

నాకు ఈ రెండూ ఇష్టమే

‘‘ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్‌ నడుస్తోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు వచ్చినప్పటి నుంచి నటీనటుల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓటీటీలో వచ్చే సినిమాల్లో ప్రతి పాత్ర ముఖ్యమైనదే. థియేటర్లలో వచ్చే సినిమాల్లో ఒక్కరే హీరో ఉంటారు. కానీ.. ఇందులో ఎవరికి వారే హీరో. నాకు ఈ రెండూ ఇష్టమే. కానీ.. ఓటీటీలో భిన్నమైన కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. సంజయ్‌ లీలా భన్సాలీ  దర్శకత్వంలో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్థా, అదితీ రావు హదరీ, సంజీదా షేక్‌ కీలక పాత్రలు పోషించిన సిరీస్‌ ఇది. హీరామండీలోని కొందరు వేశ్యల జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 1న ఈ సిరీస్‌ విడుదల కానుంది. 

Surekha Vani: అమ్మ పుట్టినరోజు, కూతురు సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా...


Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 29 , 2024 | 03:56 PM