Urvashi Rautela: వామ్మో.. ఊర్వ‌శి రౌతేలా బ‌ర్త్ డే.. 24 క్యారెట్ల గోల్డ్ కేక్‌ గిఫ్ట్‌! ఎన్ని కోట్లంటే

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:13 PM

బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఫేమ‌స్ మోడ‌ల్ ఊర్వ‌శి రౌతేలా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో న‌టిస్తూ ఎక్కువగా ప్రైవేటు కార్య‌క్ర‌మాలు ,ఈవెంట్‌ల‌తో సంద‌డి చేసే ఈ ముద్దుగుమ్మ‌ గ‌తంలో స్టేడియంలో ఫోన్ పొగొట్టుకుని సోష‌ల్ మీడియాల్లో ట్రెండింగ్‌లో కొన‌సాగింది. తాజాగా మ‌రోసారి దేశ‌ ప్ర‌జ‌లంతా షాక్ అయి నోరెళ్ల బెట్టేలా చేస్తూ వార్త‌ల్లోకెక్కి ర‌చ్చ చేస్తోంది.

Urvashi Rautela: వామ్మో.. ఊర్వ‌శి రౌతేలా బ‌ర్త్ డే.. 24 క్యారెట్ల గోల్డ్ కేక్‌ గిఫ్ట్‌! ఎన్ని కోట్లంటే
Urvashi Rautela

బాలీవుడ్ ముద్దుగుమ్మ, ఫేమ‌స్ మోడ‌ల్ ఊర్వ‌శి రౌతేలా (Urvashi Rautela) మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో న‌టిస్తూ ఎక్కువగా ప్రైవేటు కార్య‌క్ర‌మాలు ,ఈవెంట్‌ల‌తో సంద‌డి చేసే ఈ ముద్దుగుమ్మ‌ గ‌తంలో ఓ క్రికెట్ స్టేడియంలో ఫోన్ పొగొట్టుకుని వార్త‌ల్లోకెక్క‌గా చాలా రోజులు సోష‌ల్ మీడియాల్లో ట్రెండింగ్‌లో కొన‌సాగింది. తాజాగా ఈ అమ్మడు మ‌రోసారి దేశ‌ ప్ర‌జ‌లంతా షాక్ అయి నోరెళ్ల బెట్టేలా చేస్తూ వార్త‌ల్లోకెక్కి ర‌చ్చ చేస్తోంది.

URVASHI RAUTELA

సినిమాల క‌న్నా ఎక్కువ‌గా ప్రైవేటు వీడియో సాంగ్స్ ద్వారా దేశ వ్యాప్తంగా భారీగా ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్న ఊర్వ‌శి (Urvashi Rautela) మొద‌టిసారిగా 2014లో ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ యోయో హ‌నీ సింగ్ (YoYo Honey Singh) ల‌వ్ డోస్ అల్బ‌మ్‌తో వెలుగులోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి ప్రైవేట్ వీడియో సాంగ్స్‌తో యూత్‌లో ఎన‌లేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఈ క్ర‌మంలోనే వ‌రుస ఫోటోషూట్లు, క్యాలెండ‌ర్ మేకింగ్ ఈవెంట్ల‌తో ఇండియాలో టాప్ మోడ‌ల్‌గా పేరు తెచ్చుకోవ‌డ‌మే గాక హ‌య్య‌స్టె పెయిడ్ మోడ‌ల్‌గా అగ్ర స్థానంలో నిలిచింది.


ఇదిలాఉండ‌గా ఈ అమ్మ‌డు మ‌రోసారి యో యో హ‌నీ సింగ్‌(YoYo Honey Singh) తో క‌లిసి ల‌వ్‌డోస్ 2 (Love Dose)లో భాగంగా విగ్రియన్ హీరన్ (Vigriyan Heeran) అనే వీడియో సాంగ్‌ లో న‌టిస్తుండ‌గా దీని చిత్రీక‌ర‌ణ దుబాయ్‌లో జ‌రుగుతుంది. ఈక్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి 25న ఊర్వ‌శి 30వ‌ జ‌న్మ‌దినం కావ‌డంతో ఆ వీడియో షూటింగ్ స్పాట్‌లోనే మేక‌ర్స్ ఊర్వ‌శి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించారు. ఇందుకోసం స్టార్ పాప్ సింగ‌ర్ యోయో హ‌నీ సింగ్ (YoYo Honey Singh) రూ.3 కోట్ల విలువైన 24 క్యారెట్స్ గోల్డ్ కేక్‌ను గిఫ్ట్‌గా తెప్పించి యూనిట్ స‌మ‌క్షంలో క‌ట్‌ చేయించారు.

URVASHI

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అయ్యాయి. అయితే ఊర్వ‌శి రౌతేలా (Urvashi Rautela) రెండేళ్లుగా వాల్తేరు వీర‌య్య‌, ఏజెంట్‌, బ్రో, స్కంద సినిమాల‌లో స్పెష‌ల్ సాంగ్స్‌ లో క‌నిపించి తెలుగు నాట ప్ర‌త్యేక పాట‌ల స్పెష‌లిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక బ్లాక్‌రోజ్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కూడా ఎంట్రీ ఇవ్వ‌నుంది. అదేవిధంగా అమె న‌టించిన ల‌వ్‌డోస్ 2 వీడియో సాంగ్ మార్చి 15న విడుద‌ల కానుంది.

Updated Date - Feb 25 , 2024 | 04:30 PM