మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Adipurush: కళను విమర్శించడానికి మనమెవ్వరు.. నటుడు ఫైర్‌

ABN, Publish Date - Apr 12 , 2024 | 04:50 PM

ప్రభాస్‌ (Prabhas) శ్రీరాముడిగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్  (om raut) తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌(Adipurush) ’. రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతగా కృతిసనన్‌ నటించారు.

Prabhas - Adipurush

ప్రభాస్‌ (Prabhas) శ్రీరాముడిగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్  (om raut) తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌(Adipurush) ’. రూ.600 కోట్ల భారీ బడ్జెజ్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతగా కృతిసనన్‌ నటించారు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విమర్శల పాలైంది. సినిమాను విమర్శిస్తున్న వారిపై ఈ చిత్రంలో బ్రహ్మ పాత్ర పోషించిన నటుడు బిజయ్‌ ఆనంద్‌ (bijay anand) తాజాగా స్పందించారు. తాజాగా ఆయన నటించిన 'బడే మియా ఛోటేమియా’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన విమర్శలు చేసినవారిపై కీలక వ్యాఖ్యలు చేశారు.  

‘‘నాకు కళలంటే ప్రాణం. నిత్యం కళను ఆరాధిస్తుంటా. సుమారు రూ.600 కోట్లు ఖర్చు పెట్టి ఓంరౌత్‌ ‘ఆదిపురుష్‌’ తెరకెక్కించారు. ఒక దర్శకుడిగా అది ఆయన ఛాయిస్‌. కథను తెరపై ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు. అది కొందరికి నచ్చొచ్చు. నచ్చకపోవచ్చు. అందరికి నచ్చాలని లేదు.. నచ్చితే సినిమా చుడండి..  నచ్చకపోతే చూడొద్దు. ఇతరుల కళను విమర్శించడానికి మనమెవ్వరు?. బాలి, వియాత్నంతోపాటుపలు ఆసియా దేశాల్లో నేను పర్యటించా. సీతారామలక్ష్మణులకు సంబంధించి ఆయా దేశాల్లో విభిన్న కథలు విన్నా. రామాయణం ఒక ఎపిక్‌. దానిని ఎంతమంది తెరకెక్కించారు? ఎవరు తెరకెక్కించారు? అనేది ఎప్పటికీ విషయం కాదు. అద్భుతంగా తీర్చిదిద్దితే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అని అన్నారు. త్వరలో నితీశ్‌ తివారీ తెరకెక్కించనున్న ‘రామాయణం’ కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పారు. 

Updated Date - Apr 12 , 2024 | 05:58 PM