మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Naatu Naatu: నాటు నాటు అన్న ఖాన్ త్రయం.. తెలుగు ప్రేక్షకులు వావ్‌!

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:04 PM

'నాటు నాటు’ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే! ఆ పాట క్రేజ్‌ ఏకంగా భారతకు, అందులోనూ తెలుగు సినిమాకు ఆస్కార్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికీ ఈ పాట ప్రతి వేడుకలోనూ సందడి చేస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్‌ ఖాన్  త్రయం సల్మాన్‌ ఖాన్‌, షారక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ముగ్గురు కలిసి ఈ పాటకు చిందేశారు

Naatu Naatu: నాటు నాటు అన్న ఖాన్ త్రయం.. తెలుగు ప్రేక్షకులు వావ్‌!

"నాటు నాటు’ (Naatu naatu) పాట ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే! ఆ పాట క్రేజ్‌ ఏకంగా భారతకు, అందులోనూ తెలుగు సినిమాకు ఆస్కార్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికీ ఈ పాట ప్రతి వేడుకలోనూ సందడి చేస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్‌ ఖాన్ త్రయం (Khan Trio)సల్మాన్‌ ఖాన్‌, షారక్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ ముగ్గురు కలిసి చిందేశారు.  రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌, ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌ వేదికగా జరుగుతోన్న ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు వారి డ్యాన్స్‌లతో సందడి చేశారు. (Salman khan, Shah rukh khan, Aamir khan, Ram charan)

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ఖాన్ , షారుక్‌, ఆమిర్‌ ఖాన్ ఒకే వేదికపై కలవడం చాలా అరుదు. అలాంటిది ముగ్గురు కలిసి అంబానీ ఈవెంట్‌లో ఫేమస్‌ పాటకు డ్యాన్స్‌ వేసి అలరించారు. ఆస్కార్‌ విన్నింగ్‌ సాంగ్‌ నాటునాటు పాటకు స్టెప్‌ వేశారు. వేదికపై నాటునాటు పాట ప్లే చేయగానే ఖాన్ త్రయంతోపాటు ఈవెంట్‌ హోస్ట్‌ చేసిన యాంకర్‌ రామ్‌చరణ్‌ను వేదికపైకి ఆహ్వానించారు. అంతే కాదు వేదిక కింద ఉన్నవారి నుంచి కూడా రామ్‌చరణ్‌.. రామ్‌చరణ్‌ అంటూ కేకలు వేశారు. వారి ఆహ్వానం  మేరకు   రామ్ చరణ్ కూడా వేదికపైకి వెళ్లి ఖాన్ త్రయంతో కలిసి 'నాటు నాటు' పాటకు కాలు కదిపారు. ఆ తర్వాత వారి సినిమాల్లో హుక్‌ హుక్‌ స్టెప్‌లను రీక్రియేట్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ‘ఖాన్స్‌ ముగ్గురితో ఒకే స్టేజ్‌ మీద డ్యాన్స్‌ వేయించడం అంబానీకే సాధ్యమైంది’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. బాలీవుడ్‌ హీరోలు టాలీవుడ్‌ పాటకు చిందేయడంతో తెలుగు ప్రేక్షకులు ‘వావ్‌’ అంటున్నారు. ఈ ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌కు రామ్‌చరణ్‌-ఉపాసన హాజరయ్యారు. వీళ్లిద్దరూ ధోని దంపతులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

Khans.jpg

అయితే మరోవైపు  పాపులర్ పాటకు ఖాన్ త్రయం మినిమం న్యాయం చేయలేకపోయారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.  సల్మాన్ ఖాన్, షాక్ రుఖ్ ఖాన్ నాటు నాటు స్టెప్స్ బాగానే వేసిన ఆమిర్ ఖాన్ మాత్రం సరిగ్గా కాలు కడపలేకపోయారు. ఎక్కడో ఫ్లో మిస్ అయింది.  కొందరు నెటిజెన్స్ మాత్రం గుడ్ ట్రై అని ప్రశంసిస్తున్నారు. ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌కు రామ్‌చరణ్‌-ఉపాసన హాజరయ్యారు. వీళ్లిద్దరూ ధోని దంపతులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

Updated Date - Mar 03 , 2024 | 01:11 PM