Aamir khan: కూతురి పెళ్లి ఇద్దరు మాజీ భార్యలతో మిస్టర్‌ పర్ఫెక్ట్‌

ABN , Publish Date - Jan 04 , 2024 | 06:13 PM

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌, రీనా దత్త కుమార్తె ఐరా ఖాన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే! ముంబైలోని ఓ హోటల్‌ ఈ వివాహానికి వేదికేౖంది. రిజిస్టర్‌ మ్యారేజీతో ఐరా-నుపుర్‌ ఒక్కటయ్యారు. ఆమిర్‌ మాజీ భార్యలిద్దరు రీనా దత్త, కిరణ్‌ రావు సందడి చేశారు.

Aamir khan: కూతురి పెళ్లి ఇద్దరు మాజీ భార్యలతో మిస్టర్‌ పర్ఫెక్ట్‌

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌(Aamir khan), రీనా దత్త (Reena dutta) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira khan) ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే! ముంబైలోని ఓ హోటల్‌ ఈ వివాహానికి వేదికేౖంది. రిజిస్టర్‌ మ్యారేజీతో ఐరా-నుపుర్‌ ఒక్కటయ్యారు. ఆమిర్‌ మాజీ భార్యలిద్దరు రీనా దత్త, కిరణ్‌ రావు సందడి చేశారు. తల్లిగా రీనా దత్త అన్ని బాధ్యతలు చూసుకొంది. అలాగే రెండో భార్య కిరణ్‌రావు (Kiran rao) కూడా ఈ వేడుకలో పాల్గొంది. ఆమెకు ఆహ్వానం పలికిన ఆమిర్‌ నుదుటన ముద్దు పెడుతూ ఆలింగనం చేసుకున్నారు. దీంతో వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న కూడా వీరి మఽధ్య ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ira.jpg

ఆమిర్‌ ఖాన్‌- రీనా దత్త కూతురుగా ఐరాఖాన్‌ సినీ ప్రియులకు సుపరిచితమే. గత కొన్నేళ్లుగా ఆమిర్‌ ఖాన్‌కు నుపుర్‌ వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నారు. దీంతో ఐరా సైతం నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్యప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో 2022 నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇప్పుడు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ నెల 8న రాజస్థాన లోని ఉదయ్‌పుర్‌లో ఈ జంట మరోసారి వివాహ వేడుక జరుపుకోనుంది. జనవరి 13న ముంబయిలో వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు

ira 2.jpg

Updated Date - Jan 04 , 2024 | 06:46 PM