Aabha paul: మీకు గుడికి వెళ్లే అలవాటు కూడా ఉందా? స్పందించిన అభాపాల్‌

ABN , Publish Date - Mar 21 , 2024 | 08:49 PM

సల్మాన్ ఖాన్  'వీర్‌' (veer)చిత్రంలో తన పాత్రను తొలగించడం వల్లే అశ్లీల చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని చెప్పారు’ నటి అభాపాల్‌ (Aabha paul). ‘వీర్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి ‘అభాపాల్‌ ఆ సినిమా తర్వాత ‘కామసూత్ర 3డి’ (Kama sutra 3d) తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

Aabha paul:  మీకు గుడికి వెళ్లే అలవాటు కూడా ఉందా? స్పందించిన అభాపాల్‌


సల్మాన్ ఖాన్  'వీర్‌' (veer)చిత్రంలో తన పాత్రను తొలగించడం వల్లే అశ్లీల చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని చెప్పారు’ నటి అభాపాల్‌ (Aabha paul). ‘వీర్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి ‘అభాపాల్‌ ఆ సినిమా తర్వాత ‘కామసూత్ర 3డి’ (Kama sutra 3d) తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 2013లో విడుదలైన ఆ చిత్రం సెన్షేషన్ గా  నిలిచింది.  దాంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్‌ అయింది. తర్వాత ట్రిపుల్‌ ఎక్స్‌, మస్త్రం, హై తౌబ్బా వంటి రొమాంటిక్‌ వెబ్‌ సిరీస్‌తో యూత్‌కు దగ్గరైంది. ఇటీవల మధురైలోని మీనాక్షి అమ్మన్‌ ఆలయాన్ని సందర్శించిన ‘అభాపాల్‌’ తన ఫోటోలను ఇనస్టాలో పోస్ట్‌ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటో చూసిన అభిమానులు మీకు గుడికి వెళ్లే అలవాటు ఉందా? అని ప్రశ్నించారు. అలాంటి సినిమాల్లో నటించే మీలో భక్తి కూడా దాగి ఉందా..? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి స్పంధించిన అబాపాల్‌ 'ఏడాదిలో ఒక్కసారైనా భారతదేశంలోని పలు దేవాలయాలను సందర్శిస్తాను. తద్వారా ప్రశాంతత లభిస్తుంది’’ అని అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించిన అభాపాల్‌ బ్యాచలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశారు. 2005లో తొలిసారి మోడలింగ్‌లో అడుగుపెట్టింది. 2006లో అందాల పోటీలో మిస్‌ ఢిల్లీ అవార్డును గెలుచుకుని పలు యాడ్స్‌లో కనిపించారు. 2017లో సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘వీర్‌’లో చిన్న రోల్‌ చేశారు. అయితే ఆ పాత్రను ఎడిట్‌ చేసి మేకర్స్‌ తొలగించారు దీంతో ఆమె అసహనానికి గురైంది. సినిమా అవకాశం ఇచ్చి పాత్రను తొలగించడం వల్లే అశ్లీల చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత టేస్ట్‌’ అనే తమిళ చిత్రంతో దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఒక మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. దానిని లక్ష మంది  డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 2020లో విడుదలైన శృంగార నాటకం ‘మస్త్రం’లో నటించింది. ‘కామసూత్ర’ త్రీడి ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్‌ ఎంట్రీ పోటీలో నిలిచింది. ఏకంగా మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం విశేషం. ఇందులో షెర్లిన్‌ చోప్రా కూడా ఓ పాత్రలో నటించారు.

Updated Date - Mar 21 , 2024 | 08:51 PM