69th FilmFare Awards: ఉత్తమ నటుడు రణ్‌బీర్‌... ఉత్తమ చిత్రం 12th ఫెయిల్‌

ABN , Publish Date - Jan 29 , 2024 | 10:21 AM

బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (Film Fare awards) అవార్డుల జాబితా విడుదలైంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా వైభవంగా జరిగిన ఈ వేడుకలో విన్నర్స్‌ను ప్రకటించారు. ఈ వేడుకకు కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరించగా బాలీవుడ్‌ తారలు వేదికపై సందడి చేశారు

69th FilmFare Awards: ఉత్తమ నటుడు రణ్‌బీర్‌... ఉత్తమ చిత్రం 12th ఫెయిల్‌

బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ (Film Fare awards) అవార్డుల జాబితా విడుదలైంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా వైభవంగా జరిగిన ఈ వేడుకలో విన్నర్స్‌ను ప్రకటించారు. ఈ వేడుకకు కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరించగా బాలీవుడ్‌ తారలు వేదికపై సందడి చేశారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ జంట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు వరించాయి. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన '12th ఫెయిల్‌' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్‌’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ చిత్రానికి మూడు విభాగాల్లో అవార్డులు వరించాయి. 

Animal.jpg

అవార్డుల జాబితా ఇదే..

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌

ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌

ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)

12th-fail.jpg

ఉత్తమ దర్శకుడు:  విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)

ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)

Ricky.jpg

ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌ 

ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)

OMG.jpg

ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)

ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)

Animal.jpg

Updated Date - Jan 29 , 2024 | 10:53 AM