మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medha Shankr: 12th Fail బ్యూటీ.. ఇలా తెగించేసిందేంటి!

ABN, Publish Date - Mar 22 , 2024 | 03:57 PM

మేధా శంకర్ అంటే చాలామందికి తెలియ‌క‌పోవ‌చ్చు కానీ 12ఫెయిల్ క‌థానాయిక అంటే ఇట్టే అంద‌రికీ గుర్తుకు వ‌స్తుంది. తాజాగా ఓ ఫ్యాష‌న్ షోలో త‌న వేష‌ధార‌ణ‌ల‌తో ఆహుతుల‌ను షాక్‌కు గురి చేసింది.

medha shankar

మేధా శంకర్ (Medha Shankar) అంటే చాలామందికి తెలియ‌క‌పోవ‌చ్చు కానీ 12ఫెయిల్ (12th Fail) క‌థానాయిక అంటే ఇట్టే అంద‌రికీ గుర్తుకు వ‌స్తుంది. హీరోయిన్‌గా త‌న తొలి చిత్రంతోనే ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు సంపాదించింది.

ఆ చిత్రంలో సివిల్స్‌కు ప్రిఫేర్ అవుతున్న మ‌నోజ్ ఫ్రెండ్‌గా, ప్రేమికురాలిగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను బాగా మెప్పించింది. తాజాగా ఈ సినిమాలో న‌ట‌న‌కు గాను ఉత్త‌మ తొలి చిత్ర న‌టిగా జీ సిని ఆవార్డ్స్ 2024 ఆవార్డు సైతం ద‌క్కించుకుంది.

ముట్టుకుంటే కందిపోయే ముత్యాల ముద్దుగుమ్మ అనే ఓ తెలుగు పాట‌కు అచ్చు గుద్దిన‌ట్లు సూట‌య్యే మేధాశంక‌ర్ (Medha Shankar) తాజాగా జ‌రిగిన లాక్మే ఫ్యాష‌న్ షోలో పాల్గొని త‌న వేష‌ధార‌ణ‌ల‌తో ఆహుతుల‌ను షాక్‌కు గురి చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె లైట్ ఫ‌ర్‌ఫుల్ స్లీవ్‌లెస్ డ్రెస్ ధ‌రించి చేసిన ర్యాంప్ వాక్ వీక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింది.


12 ఫెయిల్ (12th Fail) సినిమాలో శ్ర‌ధ్దాగా నిండైన వ‌స్త‌ధార‌ణ‌, ఎప్పుడూ సంతోష‌క‌ర‌మైన‌ ముఖ‌ వ‌ర్చ‌స్సుతో ప‌క్కింటి అమ్మాయిలా క‌నిసించిన మేధ (Medha Shankar)ను బ‌య‌ట ఇలా ఒక్క‌సారిగా పూర్తిగా భిన్నమైన డ్రెస్సింగ్‌లో చూసి నోరెళ్ల బెట్టారు.

అమ్మ‌డిలో ఈ కోణం కూడా ఉందా అంటూ ఆ చిత్రాల‌ను చూసి ఆస్వాదిస్తున్నారు. ఈ ఫొటోలు వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం.. మీరూ చూసేయండి మ‌రి.

Updated Date - Mar 22 , 2024 | 04:01 PM