MegaFamily: ఓ వైపు పెళ్లి, ఇంకో వైపు విడాకులు

ABN , First Publish Date - 2023-07-05T12:54:07+05:30 IST

మెగా కుటుంబంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు అవటం, చిరంజీవి తన మనవరాలికి క్లింకారా కొణిదెల అని మమకారం చెయ్యడం, ఇంకో పక్క వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్ధం, ఇంకో పక్క నిహారిక విడాకులకు దరఖాస్తు చెయ్యటం.

MegaFamily: ఓ వైపు పెళ్లి, ఇంకో వైపు విడాకులు
Niharika Konidela

మెగా కుటుంబంలో ఈమధ్య కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మెగా అభిమానులు విచారించాలో, సంతోష పడాలో కూడా తెలియని పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్, (RamCharan) ఉపాసన దంపతులు (UpasanaKamineniKonidela) పండంటి ఆడపిల్లకి జన్మ ఇచ్చారు. ఆమెకి క్లింకారా కొణిదెల (Klin Kaara Konidela) అని నామకరణం కూడా చేశారు. చిరంజీవి (MegaStarChiranjeevi) తన మనవరాలిని చూసి ఎంతో మురిసిపోయి, తమ ఇంట్లోకి ఆడపిల్ల వచ్చింది, అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి అని చెప్పారు.

Varun Tej and Lavanya Engagement (24).jpg

చిరంజీవి తమ్ముడు నాగబాబు (MegaBrother Nagababu) కుమారుడు వరుణ్ తేజ్ (VarunTej) నిశ్చితార్థం నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) తో కొన్ని రోజుల క్రితం జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ (AlluArjun), అల్లు అరవింద్ (AlluAravind), సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) తో సహా అందరూ వచ్చి భార్యాభర్తలు కాబోతున్న ఆ జంటకి తమ శుభాభినందనలు తెలియచేసారు.

niharikak1.jpg

ఇదిలా ఉండగా ఎప్పటి నుండో నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల (NiharikaKonidela) తన భర్తతో దూరంగా వుంటున్నారు అనే వార్తలు సాంఘీక మాధ్యమాల్లో, అలాగే అన్ని మీడియా విభాగాల్లో వైరల్ అయింది కానీ దాని మీద అధికారికంగా రెండు కుటుంబాల నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ నిన్న సోమవారం కూకట్ పల్లి లోని ఫామిలీ కోర్టులో నిహారిక (NiharikaDivorce) విడాకులు కోసం దరఖాస్తు చేసుకుంది అన్న వార్త అధికారికంగా బయటకి వచ్చింది. దీనితో మెగా అభిమానులు కొంచెం విచారం వ్యక్తం చేశారు.

ఎందుకంటే నాగబాబు ఇంట్లో ఒక వైపు కొడుకు పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటే, ఇంకో వైపు కూతురు నిహారిక ఇలా విడాకులకు దరఖాస్తు చేసుకోవటం, ఆ వార్త ఇదే సమయంలో బయటకి రావటం మెగా అభిమానులని నిరాశ పరిచింది అని అంటున్నారు.

Updated Date - 2023-07-05T12:54:07+05:30 IST