VarunLav: భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం గం.2.18 నిముషాలకి పెళ్లి, ఫోటోలు వైరల్

ABN , First Publish Date - 2023-11-01T11:51:58+05:30 IST

భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల 18 నిముషాలకి వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి లు ఒక్కటవ్వుతారు అని వరుణ్ తేజ్ టీము సాంఘీక మాధ్యమంలో ప్రకటించింది.

VarunLav: భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం గం.2.18 నిముషాలకి పెళ్లి, ఫోటోలు వైరల్
Varun Tej and Lavanya Tripathi

మెగా కుటుంబం (MegaFamily) ఇటలీలో పెళ్లి సంబరాలలో వున్నారు. ఈరోజు మధ్యాహ్నం గం.2.18 నిముషాలకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (VarunTej), నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) దంపతులు కానున్నారు. ఈ పెళ్లి ఇటలీలో జరుగుతూ ఉండటం విశేషం. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఇప్పటికే ఇటలీ చేరుకొని అక్కడ గత మూడు రోజులనుండి సంబరాలలో పాల్గొంటున్నారు.

varunlav2.jpg

మెహేంది పండగ నాడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ పసుపు బట్టలతో కనిపించారు. మెగా కుటుంబసభ్యులతో ఫోటోలు కూడా తీసుకున్నారు. టాలీవుడ్ లో దర్శకురాలిగా ఆరంగేట్రం చెయ్యబోతున్న డిజైనర్ నీరజ కోన (NeerajaKona) కూడా మెగా కుటుంబంతో ఇటలీలో వున్నారు. ఆమె పెళ్లికూతురు, పెళ్ళికొడుకు బట్టలు డిజైన్ చేసినట్టుగా కనపడుతోంది.

varunlav3.jpg

అలాగే వరుణ్ తేజ్ కజిన్స్, ఇతర కుటుంబ సభ్యులు, దగ్గరి మిత్రులు కూడా ఈ వివాహానికి హాజరయ్యేవారిలో వున్నారు. వరుణ్ తేజ్ టీము సాంఘీక మాధ్యమంలో ఎప్పటికప్పుడు ఇటలీలో జరుగుతున్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ లవ్ #VarunLav అనే హేష్ టాగ్ వైరల్ అవుతూ ఉండటం విశేషం.

varunlav4.jpg

'పుష్ప' #Pushpa సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ (AlluArjun), అతని భార్య స్నేహ (Sneha) ఈ పెళ్లి సందడిలో పాల్గొన్నారు. అల్లు అర్జున్, స్నేహ చిరంజీవి (Chiranjeevi) దంపతులు, అలాగే ఇతరులతో ఫోటోలకు పోజులిచ్చినట్టుగా కనపడుతోంది. పరిశ్రమనుండి నటుడు నితిన్ (Nithiin) సతీ సమేతంగా ఈ పెళ్లి హాజరయినట్టు కనపడుతోంది.

varunlav6.jpg

సాంఘీక మాధ్యమంలో ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫోటోలు, అలాగే మెగా కుటుంబం పెళ్ళిలో తీసుకున్న ఫోటోలు అన్నీ వైరల్ అవుతూ వున్నాయి.

varunlav5.jpg

Updated Date - 2023-11-01T16:03:02+05:30 IST