Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి తప్పు సరిదిద్దుకున్న ఊర్వశి రౌతేలా

ABN , First Publish Date - 2023-07-29T12:23:58+05:30 IST

బాలీవుడ్ నుండి వచ్చిన నటీనటులకు తెలుగు భాష అర్థం కాదు, పోనీలే బాష రాకపోయినా ఇక్కడ నటిస్తున్నారు అని అనుకుంటే, కనీసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరో కూడా తెలుసుకోకపోతే ఎలా అని నెటిజన్స్ ఊర్వశి రౌతేలా ని అడుగుతూ ట్రోల్ చేస్తున్నారు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి తప్పు సరిదిద్దుకున్న ఊర్వశి రౌతేలా
Urvashi Rautela

ఇప్పుడు టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కోసం అన్ని సినిమాల్లో నటిస్తున్నది ఎవరైనా వున్నారు అంటే ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నుండి వచ్చిన ఊర్వశి రౌతేలా (UravashiRautela). చిరంజీవితో (Chiranjeevi) 'వాల్తేర్ వీరయ్య' (WaltairVeerayya) లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి, ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ (PawanKalyan) సినిమా 'బ్రో' #Bro లో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది ఊర్వశి రౌతేలా. #BroTheAvatar అలాగే చాలా తెలుగు సినిమాల్లో ఇప్పుడు స్పెషల్ సాంగ్ అనగానే ఆమెనే తీసుకు వస్తున్నారు.

ముంబై నుండి వచ్చిన ఊర్వశి రౌతేలాకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో సరిగ్గా తెలిసినట్టుగా లేదు, ఆమె టీం కూడా ఆమెకి సరైన సమాచారం ఇచ్చినట్టుగా లేదు. మూడు రోజుల క్రితం జరిగిన 'బ్రో' #BroPreRelease ప్రీ రిలీజ్ వేడుకకు ఊర్వశి రౌతేలా కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ అందరికీ థేంక్స్ చెపుతూ ఊర్వశి రౌతేలా కి కూడా ఈ సినిమాలో నటించినందుకు థేంక్స్ చెప్పాడు.

urvashirautela-bro1.jpg

ఊర్వశి రౌతేలాకి సాంఘీక మాధ్యమాల్లో బాగానే ఫాలోవర్స్ వున్నారు. ఆమె పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) తో ఒక ఫోటో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (AndhraPradeshChiefMinister) గా సంబోదించింది ఆ ట్వీట్ లో. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చెయ్యడం చాలా ఆనందంగా వుంది అంటూ ఆ ట్వీట్ పెట్టింది. ఇంకేమి నెటిజన్స్ అందరూ ఆమెని ఒకటే ట్రోల్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలీదా అంటూ.

ఇలా అందరూ ట్రోల్ చేసేసరికి పాపం ఊర్వశి రౌతేలా కి అప్పుడు తెలిసినట్టుంది. తెలిసి తన తప్పు సరిదిద్దుకోవాలని అనుకుందేమో, వెంటనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అనే పదాలను తీసేసింది మళ్ళీ ట్వీట్ చేసింది కరెక్టుగా. దానికి కూడా నెటిజన్స్ వదల్లేదు, అది కూడా బాగా ట్రోల్ చేశారు. ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు టీము ని అడగాలి, లేదా తెలుసుకోవాలి. ఆలా ఎలా ట్వీట్ చేస్తుంది అని అడుగుతున్నారు ఆమెని సాంఘీక మాధ్యమాల్లో.

Updated Date - 2023-07-29T12:23:58+05:30 IST