National Film Awards: పోటీ పడుతున్న నటీనటులు వీరే ! ఈసారి ముగ్గురు తెలుగు నటులు మధ్య పోటీ !

ABN , First Publish Date - 2023-08-24T16:35:15+05:30 IST

జాతీయ సినిమా పురస్కారాలు ఇంకొద్ది నిముషాల్లో ఎవరికీ ఇచ్చారో వెలువడనున్నాయి. ఈసారి ముగ్గురు తెలుగు నటులు, ముగ్గురు తమిళ నటులు, ఒక మలయాళం నటుడు, హిందీ నటుడు వున్నారని తెలిసింది. ఇంతకీ ఈ అవార్డు ఎవరికీ వస్తుందో...

National Film Awards: పోటీ పడుతున్న నటీనటులు వీరే ! ఈసారి ముగ్గురు తెలుగు నటులు మధ్య పోటీ !
Jr NTR and Ram Charan

కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న 69వ జాతీయ సినిమా పురస్కారాలు ఈ సాయంత్రం అయిదు గంటలకు #NationalFilmAwards ప్రకటించనున్నారు. అయితే ఈసారి ఉత్తమ నటుడు కేటగిరీలో చాలామంది నటులు పోటీ పడుతున్నట్టుగా సమాచారం అందింది. ఇందులో ఒక్క తెలుగు సినిమా నుండి మూగ్గురు నటులు పోటీపడుతున్నారని తెలిసింది. అల్లు అర్జున్ (AlluArjun) (పుష్ప), రామ్ చరణ్ (RamCharan) అలాగే జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) (ఆర్ఆర్ఆర్) కూడా తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. తమిళం నుండి సూర్య, ధనుష్, శింబు కూడా పోటీ పడుతున్నారు. సూర్య కి గత సంవత్సరం ఈ అవార్డు దక్కింది, అతనికి అజయ్ దేవగన్ తో కలిపి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు. #RRR

అలాగే ఉత్తమ నటీమణుల కేటగిరీ లో అలియా భట్, కంగనా రనౌత్ లు పోటీ పడుతున్నట్టుగా తెలిసింది. కంగనా కి ఇంతకు ముందు చాలా జాతీయ అవార్డులు అంటే మూడు సార్లు ఉత్తమ నటిగా ఎంపికయింది, ఒకసారి సహాయ నటిగా కూడా ఎంపికయింది. #NationalFilmAwards

pushpa-the-rule.jpg

ఇదిలా ఉండగా, హిందీ నటుడు విక్కీ కౌశల్ ఈసారి దక్షిణాదికి చెందిన నటులకి గట్టి పోటీ ఇస్తాడు అని కూడా తెలిసింది. విక్కీ నటించిన 'సర్దార్ ఉదం' లో అతని ప్రతిభకి గాను ఈసారి అతను నామినేషన్ వున్నట్టుగా తెలిసింది.

ఉత్తమ నటుడు కేటగిరీ లో పోటీపడుతున్న నటులు

అల్లు అర్జున్ (తెలుగు) : పుష్ప - ది రైజ్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (తెలుగు) -- ఆర్ఆర్ఆర్

సూర్య (తమిళం) -- జై భీం

ధనుష్ (తమిళం) -- కర్ణన్

శింబు (తమిళం) -- మానాడు

ఆర్య (తమిళం) -- సర్పట్ట పరంబర్తె

జోజు జార్జి (మలయాళం) -- నయట్టు

ఉత్తమ నటి కేటగిరీ లో పోటీ పడుతున్న నటీమణులు

అలియా భట్ (హిందీ) -- గంగూభాయ్ కథియావాడి

కంగనా రనౌత్ (తమిళం) -- తలైవి

Updated Date - 2023-08-24T16:35:15+05:30 IST