Mega family: పవన్ కళ్యాణ్ భార్య అచ్చం తెలుగింటి ఆడపడుచులా, ఫామిలీ పిక్ వైరల్

ABN , First Publish Date - 2023-11-02T10:33:18+05:30 IST

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మెగా వెడ్డింగ్ లో చిరంజీవి అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు అందరూ కలిపి ఒక గ్రూప్ ఫోటోకి పోజు ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ భార్య కూడా వున్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది, మెగా అభిమానుల ఆనందానికి అంతే లేదు.

Mega family: పవన్ కళ్యాణ్ భార్య అచ్చం తెలుగింటి ఆడపడుచులా, ఫామిలీ పిక్ వైరల్
The newly married couple Varun Tej and Lavanya Tripathi

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కుమారుడు వరుణ్ తేజ్ (VarunTej), నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) తో వివాహం ఇటలీ లో జరిగింది. వరుణ్ తేజ్ నిన్న ఇటలీలో మూడుముళ్లు వేసి లావణ్యని తన భార్యగా చేసుకున్నాడు. ఈ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులు (MegaFamily) అందరూ ఆ పెళ్ళికి హాజరయ్యి అక్కడ కలుసుకున్నారు. ఇదే సందర్భంలో మెగా బ్రదర్స్, అక్క చెల్లెల్లు అందరూ ఒక గ్రూపులో వున్న ఫోటో ఒకటి సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతోంది. #VarunLav

మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)--సురేఖ, నాగబాబు-పద్మజ, పవన్ కళ్యాణ్ (PawanKalyan)-అన్నా లెజెనోవా (AnnaLezhneva), అలాగే వారి సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి వారి భర్తలతో వున్న గ్రూపు ఫోటో వైరల్ అవుతోంది. ఇది రేర్ ఫోటో అని అంటున్నారు. ఎందుకంటే అందరూ ఇలా కలుసుకునేది ఏదైనా ఒక ఫంక్షన్ లోనే కదా, ఈసారి అందరూ వరుణ్ తేజ్ పెళ్ళికి కలవటం, ఇలా ఫోటోకి పోజులివ్వటం బాగుంది అని అభిమానులు ఆనంద పడుతున్నారు. #MegaWedding

megafamily1.jpg

ఇక పవన్ కళ్యాణ్ (PawanKalyan) భార్య అన్నా లెజెనోవా అయితే అచ్చం తెలుగింటి ఆడపడుచులా చీరలో కనిపించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అభిమానులు ఆనందపడటానికి ఇంకొక కారణం కూడా వుంది, ఏంటంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ వివాహం గురించి చాలామంది ఏదేదో మాట్లాడారు, అవన్నీ పటాపంచలు చెయ్యడానికి కూడా ఈ ఒక్క ఫోటో చాలు అని అభిమానులు అంటున్నారు.

Updated Date - 2023-11-02T10:33:18+05:30 IST