Mega Star: ఇప్పటివరకు ఇదే అతి పెద్ద కట్ అవుట్ అంట !

ABN , First Publish Date - 2023-07-29T15:27:48+05:30 IST

మొన్నటి వరకు ఏ సినిమా ఎంత కలెక్టు చేసింది, మొదటి రోజు, రెండో రోజు రికార్డ్స్, ఇలాంటి కలెక్షన్ల రికార్డ్స్ ఉండేవి. ఇప్పుడు ఆ రికార్డు కట్ అవుట్ లకు వెళ్ళింది. చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా నుండి చిరంజీవి కట్ అవుట్ సూర్య పేట దగ్గర ఆ చిత్ర నిర్వాహకులు పెట్టిన కట్ అవుట్ అతి పెద్దదిగా చెప్తున్నారు.

Mega Star: ఇప్పటివరకు ఇదే అతి పెద్ద కట్ అవుట్ అంట !
Chiranjeevi cut out at Suryapet

తెలుగు అగ్ర నటీనటుల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే అభిమానులకు పండగే. అభిమానులు రేపు విడుదల అనగా ముందురోజీ పూల దండలు, పువ్వులు, కాయితాలు ఇలా ఒకటేమిటి ఆ నటుడి సినిమా విడులవుతున్న సినిమా థియేటర్ ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతారు. అలాగే కట్ అవుట్ లు కూడా ఒకదానికి మించి ఇంకొకటి పెడుతూ వుంటారు. మాది చాలా ఎత్తయినది అంటే, మాది ఇంకా ఎక్కువ అడుగులు వున్నది అని చెపుతూ వుంటారు.

ఇలా తెలుగు అగ్రనటుల కట్ అవుట్ లు కూడా ఇప్పుడు రికార్డు ల మోత మోగుతోంది. మెగా స్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) నటించిన 'భోళా శంకర్' #BholaaShankar సినిమా ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడులవుతోంది. దీనికి మెహెర్ రమేష్ (MeherRamesh) దర్శకుడు కాగా, అనిల్ సుంకర (AnilSunkara) ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా లోంచి చిరంజీవి కట్ అవుట్ ఒకటి సూర్యాపేట దగ్గర ఈ చిత్ర నిర్వాహకులు పెట్టారు. ఇది ఇప్పుడు పరిశ్రమలో అతి పెద్ద కట్ అవుట్ గా చెప్తున్నారు.

chiranjeevi-cutout.jpg

ఈ కట్ అవుట్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయింది. చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా భాటియా (TamannaahBhatia) కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ (KeerthySuresh) ఇందులో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. సుశాంత్ (Sushanth) ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అజిత్ (Ajith) నటించిన 'వేదాలమ్' (Vedalam) సినిమాకి రీమేక్. అయితే తెలుగు రీమేక్ లో కొన్ని మార్పులు చేసినట్టుగా కనపడుతోంది. మొన్ననే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు ట్రేండింగ్ లో వుంది.

Updated Date - 2023-07-29T15:29:39+05:30 IST